పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేస్తున్నాను" అన్నాడు ప్రభువు - యోహా 14,31. సిలువ మరణానికి ముందు ఒలీవల తోపులో శ్రమచెందుతూగూడ తన చిత్తప్రకారంగాదు తండ్రి చిత్తప్రకారమే జరగాలి అని పల్మాడు - లూకా 22,42. అతడు తండ్రిని గాఢంగా ప్రేమించాడు. కనుక తనకు మరణం సిద్ధించినాసరే ఆ తండ్రి ఆజ్ఞకు బదుడయ్యాడు.

క్రీస్తు మనపట్ల ప్రేమవలనగూడ సిలువమరణానికి పూనుకొన్నాడు. స్నేహితులకొరకు ప్రాణాలర్పించేవాని కంటె ఎక్కువ ప్రేమగలవాడు ఎవడూలేడు అన్నాడు ప్రభువు - యోహా 15,13. అతడు మనపట్ల తనకు గల ప్రేమను రుజువు చేసుకొంటూ చనిపోయాడు. పాపియైన నరుడు భగవంతునికి విరోధి. మనం పాపులమై దేవునికి శత్రువులంగా వుండగా అతడు మనకొరకు చనిపోయాడు - రోమా 5,10. ఆ ప్రభువు ఏ నిర్భంధానికి గురికాకుండా స్వేచ్చగానే మనకొరకు అసువులర్పించాడు. కనుకనే అతడు "ఎవడూ నా ప్రాణాలను గైకొనలేడు, నాయంతట నేనే నా యసువులు బలిగా అర్పిస్తున్నాను" అన్నాడు - యోహా 10,18. కనుక క్రీస్తు మరణానికి ప్రేమే ప్రధాన కారణం.

2. క్రీస్తు మరణస్వభావం

నరుని మరణంలో రెండంశాలున్నాయి. ගිහසභීධි, దానిద్వారా మన మానవజీవితం నశిస్తుంది. మన దేహాత్మలు వేరైపోతాయి. మనం అంతమైపోతాం. అది మనకు ఎంతో బాధా దుఃఖమూ భయమూ కలిగిస్తుంది. బ్రతికివున్న ప్రాణి ఏదికూడ చనిపోడానికి వొప్పుకోదు. ఈ దృష్టితో జూస్తే మరణం మనకు శిక్ష

రెండవది, అది మన జీవితంలోకల్ల గొప్ప కార్యం. మన మనుగడలో తుది నిర్ణయం. మనమే దాన్ని స్వేచ్చా పూర్వకంగా నిర్ణయించుకొంటాం. దానిద్వారా మనం నూత్న జీవితంలోకి సాగిపోతాం. ఈ దృష్టితోజూస్తే మరణం మనకు శిక్ష కాదు. అది మన జీవితానికి ఫలసిద్ధి అవుతుంది.

ఇక, శిక్ష ఫలసిద్ధి అనే పై రెండంశాలు క్రీస్తు మరణంలో కూడ వున్నాయి. మొదట అతని మరణం శిక్షాత్మకమైంది. అతడు పాపపు నరజాతిలో పుట్టాడు. పాపం ఫలితం చావు అన్నాడు పౌలు - రోమా 6,23. కనుక క్రీస్తుకూడ చనిపోవలసి వచ్చింది. అతడు మృత్యువేదనకు గురయ్యాడు - హెబ్రే 2,9. మరణభయానికి లొంగి తండ్రీ ఈ పాత్రను నాయొద్దనుండి తొలగించు అని వేడుకొన్నాడు - మార్కు 1436. ఈ శిక్షాత్మకమైన క్రీస్తు మరణం మనలను రక్షించలేదు.

రెండవది, అతని, మరణం ఫలసిద్ధితో కూడిందికూడ. ప్రభువు మనకోసం చనిపోవడానికి స్వయంగానే నిర్ణయం చేసికొన్నాడు. నాయంతట నేనే నా ప్రాణాన్ని