పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన బలహీనతకు సంబంధించిన రంగంలోనే మనకు ఎక్కువ శోధనలు వస్తుంటాయి. కనుక ఎవరి బలహీనతలను వాళ్ళు చక్కగా అర్థంచేసికొని ఆ రంగంలో వచ్చే విశేష శోధనలను జయిస్తుండాలి.

పైగా మనం పాపావకాశాలనుగూడ ముందుగానే గుర్తుపడుతుండాలి. పలానా తావుకి వెళ్లే, పలానా పనికి పూనుకొంటే పాపంలో పడిపోతామని మనకు ముందుగానే తెలుసు. ఆలాంటప్పుడు ముందుగానే జాగ్రత్తపడి ఆ శోధనలనుండి తప్పకొంటూండాలి.

4. శోధనలు వచ్చినపుడు యేసు దివ్యనామాన్ని స్మరించుకొంటే కొండంత బలం పొందుతాం. ఆ బలంతో ప్రలోభాలను జయించవచ్చు. జాన్ క్లిమాకస్ అనే భక్తుడు "యేసు దివ్యనామంతో పిశాచాలను చావమోదవచ్చు. దయ్యాలను జయించాలంటే భూలోకంలోగాని పరలోకంలోగాని ఇంతకంటె మెరుగైన ఆయుధం మరొకటి లేదు" అని వాకొన్నాడు. యేసునామమంటే యేసుప్రభువే. కనుక మనం ఆ ప్రభువుని స్మరించుకొని అతని శక్తితో శత్రువులను జయించాలి.

5. క్రీస్తు తండ్రిని తెలియ జేసేవాడు

క్రీస్తు ప్రవక్త యాజకుడు, రాజు, ప్రవక్తగా అతడు బోధ చేస్తాడు. తండ్రినిగూర్చి తెలియజేస్తాడు. తండ్రిని ఎరుకపరచడం అతని ముఖ్యకార్యాల్లో ఒకటి. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. బెబులు బోధలు

బైబులు బోధలు క్రీస్తు తండ్రిని తెలియపరచేవాడని చెప్తాయి. అతడు కేవలం తండ్రిని గూర్చిన సమాచారాన్ని తెలియజేసేవాడు మాత్రమేకాదు. ఆ సమాచారం తానే, తండ్రి క్రీస్తుద్వారానే మనలను రక్షించేది. కనుక క్రీస్తు తండ్రినిగూర్చి చెప్పే సమాచారమేమిటంటే, ఆ తండ్రి తన ద్వారా ప్రజలను రక్షిస్తాడని, కనుక క్రీస్తు తండ్రిని తెలియజేయడంద్వారా తన్నుతానే తెలియజేసికొంటాడు. క్రీస్తుద్వారా, క్రీస్తునందు తండ్రి మనకు ప్రత్యక్షమౌతాడు.

1. మొదట అపోస్తలుల చర్యలను చూద్దాం. ఈ గ్రంథంలో వుంది క్రీస్తు వత్థానానంతరము అపోస్తలులు చేసిన తొలి బోధ.ఈ గ్రంథం భావాల ప్రకారం అద్భుతాలు