పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీళ్ళు త్రాగి సంతృప్తి చెందారు. ఈ సందర్భంలోనే మోషే "ప్రభువుని పరీక్షకు గురిచేయకూడదు" అనే నియమం చేసాడు - ద్వితీ 6,16.

ఈలాంటి శోధన్నేపిశాచం క్రీస్తకిగూడ తెచ్చిపెట్టింది. మెస్సీయా ఆకాశంనుండి అద్భుతంగా ఊడిపడతాడు అనే భావం ఆ రోజుల్లో యూదుల్లో ప్రచారంలో వుండేది. కనుక క్రీస్తు యిప్పడు దేవాలయ గోపురంమీది నుండి క్రిందికి దూకితేచాలు యెరూషలేములో యూదులంతా అతన్ని మెస్సీయాగా అంగీకరిస్తారు. అలా దూకినప్పడు తనకు ఏ అపాయమూ కలుగకుండా తండ్రి కాపాడవచ్చు కదా! అలా కాపడ్డానికి తాను దేవదూతను పంపుతాడో లేదో పరీక్షచేసి చూడమంది పిశాచం. దీనితో దేవుడు తనకు తోడుగా వుందీ లేందీ తేలిపోతుంది అని చెప్పింది. కాని క్రీస్తుకి పిశాచం మనసు అర్థమయింది. దేవుణ్ణి పరీక్షించి చూడ్డానికై మనకిష్టమొచ్చిన పిచ్చి పనులన్నీ చేయవచ్చా? పైగా క్రీస్తు ఏమి చేయాలో ఏమి చేయకూడదో తండ్రి ముందుగానే నిర్ణయించాడు. తాను ఆ తండ్రియందు అపనమ్మిక చెందనక్కరలేదు. అతన్ని మెస్సీయాగా ప్రజలు అంగీకరించే రోజులు వాటంతట అవే వస్తాయి. కనుక అతడు ప్రభువుని పరీక్షకు గురిచేయకూడదు అన్న పై వేదవాక్యంతో దయ్యం నోరు మూయించాడు.

3. విగ్రహారాధనం : సైతాను మూడవ శోధనం ప్రారంభించింది. క్రీస్తుని ఎత్తయిన కొండమీదికి తీసికొని వెళ్ళి లోకంలోని రాజ్యాలనూ వాటి వైభవాలనూ చూపించింది. నీవు చాగిలపడి నాకు మొక్కావంటే అ రాజ్యాలన్నీ నీకిచ్చివేస్తాను అంది. ఈలాంటి శోధన్నే పూర్వం ఎడారిలో పయనించే యిప్రాయేలీయులకు కూడ కలిగించింది దయ్యం.ప్రభువు అప్పుడే సీనాయికొండ దగ్గిర యిప్రాయేలీయులతో ఒడంబడిక చేసికొని ముగించుకొన్నాడు. దేవునిచే పది యాజ్ఞలు వ్రాయించుకొని రావడానికై మోషే కొండమీదికి వెళ్ళి అక్కడ కొంచెం ఆలస్యం చేసాడు. వెంటనే యిస్రాయేలీయులు అహరోనుతో "ఆ మోషే వున్నాడే అతనికి కొండమీద ఏమి కీడుమూడిందో మాకు తెలియదు. అతడిక దిగిరాడు. నీవు మాకు బంగారు క్టోడెదూడను చేసిపెట్టు. మేము దానిని ఆరాధించుకొంటాం" అన్నారు. అలాగే అహరోను దూడను చేయగా వాళ్ళు "మనలను ఐగుప్తనుండి కొనివచ్చింది ఈ దేవుడే" నని పలుకుతూ దాన్ని ఆరాధించారు — నిర్గ 32, 1-6. ఆ రోజుల్లో యిప్రాయేలీయులకు సోదరజాతియైన కనానీయులు బాలును కొల్చేవారు. ఆ బాలుకు చిహ్నం ఎద్దు. కనుక ఎద్దును కూడ ఆరాధించేవాళ్ళ వాళ్ళను చూచి యిస్రాయేలీయులు కూడ ఇక్కడ వృషభపూజకు పాల్పడ్డారు. ఈ విగ్రహారాధనంవల్ల బాలుదేవుడు తమకు