పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలాంటి శోధన్నే మళ్ళా క్రీస్తుకుకూడా తెచ్చిపెట్టింది పిశాచం. అతడు రాళ్ళను రొట్టెలుగా మారిస్తే బాగుంటుందని సూచించింది. కాని క్రీస్తు అలా ఎందుకు మార్చకూడదు? అలా చేయడం తండ్రి నిర్ణయించిన ప్రణాళికకు వ్యతిరేకంగా పోవడమవుతుంది. ఇక్కడ క్రీస్తు ఉపవాసం చేయాలని తండ్రి నిర్ణయం. క్రీస్తు ఈ నిర్ణయాన్ని మీరేలాచేసి అతడు తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా పోయేలా చేయాలని సైతాను ఉద్దేశం. పిశాచం శోధనం క్రీస్తుకి అర్థమయింది. కనుకనే అతడు "నరుడు రొట్టెచేతమాత్రమేగాదు, దేవుని నోటినుండి వెలువడే ప్రతిమాటవలనా జీవిస్తాడు సుమా!" అనే పూర్వవేద వాక్యాన్ని ఉదాహరించాడు - ద్వితీ 8,3. ఈ వేదవాక్యంలో “మాట" అంటే దైవచిత్తం. అనగా భక్తుడు ప్రధానంగా దైడCత్త ప్రకారం, దైవప్రణాళిక ప్రకారం జీవించాలి. మనకు కూడా గుడ్డా మొదలైనవన్నీ చేకూర్చి పెట్టేది ఆ దైవచిత్తమే. ఆ దైవచిత్తం వలననేగదా వానలు కురిసి పంటలు పండి నరులకు ఆహారం సిద్ధించేది - జ్ఞాన 16,26. కనుక భోజనానికంటెగూడ ముందు దైవచిత్తం పాటింపదగ్గది. భక్తుడు మొదట భగవంతుణ్ణి నమ్మకొని జీవించాలి. అతని ఆజ్ఞలను పాటించాలి. అప్పడు కూడు గుడ్డ మొదలైన అవసరాలన్ని ఆ ప్రభువే తీరుస్తాడు. క్రీస్తు ఈలా జవాబుచెప్పేప్పటికి పిశాచానికి నోట మాట రాలేదు.

2. దేవుణ్ణి పరీక్షకు గురిచేయడం : పిశాచం రెండవశోధనం ప్రారంభించింది. క్రీస్తుని యెరూషలేములోని దేవాలయం గోపురంమీదికి తీసుకొని వెళ్ళింది. అక్కడినుండి క్రిందికి దూకమంది, క్రీస్తే గనుక దేవుని కుమారుడైతే ఆ దేవుడు దూతలనుబంపి ఏ అపాయమూ కలుగకుండా వాళ్ళు అతన్ని తమ చేతుల్లో ఎత్తిపట్టుకొనేలా చేస్తాళ్ళే అని చెప్పింది. అనగా దేవుడు తన్ను కాపాడ్డానికి వస్తాడో లేదో తెలిసికొమ్మంది, దేవుణ్ణి పరీక్షకు గురిచేయమంది.

ఈలాంటి శోధన్నే పిశాచం పూర్వం ఎడారిలో పయనించే యిప్రాయేలీయులకు గూడ కలిగించింది. సీను ఎడారిలో మస్సామెరీబా అనే తావులో వుండగా వాళ్ళకు దప్పిక వేసింది. వెంటనే ఆ ప్రజలు పిశాచ శోధితులై మోషేమీద తిరుగబడ్డారు. "నీవు మమ్మదప్పికతో చంపివేయడానికే ఈ ఎడారికి తోడ్కొని వచ్చావు. దేవుడే కనుక మనతో వుంటే ఈ యగచాట్లన్నీ యెందుకు వస్తాయి? అసలు అతడు మనతో వున్నాడు అనడానికి రుజువేమిటి?" అని వాదించారు - నిర్గ 17,3-7. ఈ విధంగా వాళ్ళ పిశాచ శోధనకు లొంగిపోయారు. ఐనా ప్రభువు వాళ్ళను కరుణించి రాతి చట్టనుండి అద్భుతంగా నీళ్ళు వెలువరించాడు. తాను వాళ్ళతో వున్నానని రుజువుచేసికొన్నాడు. అప్పడు ప్రజలు ఆ