పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. క్రీస్తు శోధనలు ఎలా జరిగాయి? పిశాచం క్రీస్తుని దేవాలయ గోపురంమీదికి, .రాజ్యాలన్నిటినీ చూపగలిగే ఎత్తయిన కొండమీదికి తీసికొని వెళ్ళిందని చెప్తుంది సువిశేషం. అలా దయ్యం అతన్ని యథార్థంగా దేవాలయం మీదికీ కొండమీదికి తీసికొని వెళ్ళిందోలేదో మనకు తెలియదు. లోకంలోని రాజ్యాలన్నింటినీ చూపగలిగేంత ఎత్తయిన కొండ ఏదీ ప్రపంచంలో లేదుకూడ భూతం ఎడారిలోనే క్రీస్తు మనోనేత్రాలకు దేవాలయ గోపురాన్నీ కొండనీ ప్రదర్శించి వుండవచ్చు. అతడు ఎడారిదాటి బయటికి వెళ్ళివుండకపోవచ్చు. అసలు ఈ శోధనలు ఏలా జరిగాయో మనకు తెలియదు. ఐనా అవి మాత్రం యధార్థంగా జరిగాయి. భక్తులు క్రీస్తు దైవత్వాన్ని శంకించే అపాయమున్నా సువిశేషకారులు ఈ సంఘటనాన్ని సువార్తల్లో లిఖించారని ముందే చెప్పాం.

2. మూడు శోధనలు

1. భోజన ప్రీతి : పిశాచం క్రీస్తుని ముమ్మారు శోధించింది. వాటిల్లో మొదటిది భోజన ప్రీతి, ప్రభువు నలువదిరోజులు ఉపవాసముండి ఆకలిగొని వున్నాడు. అప్పడు పిశాచం కొండమీది రాళ్ళను రొట్టెలుగా మార్చి ఆకలి తీర్చుకోవచ్చు అనే తలంపు పట్టించింది. కొండమీది చిన్న గుండ్రాళ్ళు రొట్టెల్లాగే వుంటాయి.ఆకలైనవాడికి అన్ని వస్తువులూ ఆహారాన్నే తలపింపజేస్తుంటాయి గూడ. ఈ మనస్తత్వాన్ని ఆధారంగా తీసుకొని ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చమంది దయ్యం.

ఈలాంటి శోధననే మొదట ఎడారిలో ప్రయాణం చేసే యిస్రాయేలీయులకు గూడ తెచ్చిపెట్టింది దయ్యం.ప్రభువు ఫరో చక్రవర్తిని ముప్పతిప్పలు పెట్టి యిస్రాయేలీయులను ఐగుపునుండి తోడ్కొని వచ్చాడు. వాళ్ళను రెల్ల సముద్రం దాటించాడు. రేయి నిప్పకంబంలాగ, పగలు మబ్బుకంబంలాగ తాను వాళ్ళతో ప్రయాణం చేసాడు. ఐనా వాళ్ళకు యావేమీద నమ్మకం కుదరలేదు. సీను ఎడారిలో పయనిస్తూన్నపుడు వాళ్లు మోషేమీద తిరుగబడ్డారు. మేము ఐగుపులో వున్నపుడు మాంసమూ రొట్టెలూ మస్తుగా భుజించాం. ఈ ఎడారిలో ఐతే ఆకలితో చస్తున్నాం. నీవు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?” అని గొణిగారు - నిర్గ 16,2-3. ఇది పిశాచం కలిగించిన శోధనం. దీనికి యిస్రాయేలీయులు లొంగిపోయారు. ఐనా ప్రభువు కరుణబూని అక్కడ యిప్రాయేలీయులకు అద్భుతంగా మన్నా కురిపించాడు. పూరేడు పిట్టలు గుంపులు గుంపులుగా దిగివచ్చేలా చేసాడు. వీటినన్నింటినీ భుజించి ఆ ప్రజలు అప్పటికి సంతృప్తి చెందారు.