పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నలు

1.విమోచనం అంటే యేమిటి? పూర్వవేదంలో యావే నూత్నవేదంలో క్రీస్తు ఏలా విమోచకులయ్యారు?
2.క్రీస్తు నూత్నవేద మధ్యవర్తి - వివరించండి.
3.క్రీస్తు మన గొర్రెపిల్ల అనడంలో గల మూడు భావాలను విశదీకరించండి.
4.యావే, క్రీస్తు ఏలా కాపరులౌతారో తెలియజేయండి. కాపరిని గూర్చి నాల్గవ సువిశేషం ਝੰਤ5 ప్రత్యేక భావాలు ఏమిటివి?
5.వెలుగును గూర్చిన పూర్వ నూత్నవేద భావాలను పేర్కొనండి.
6.దివ్యసత్రసాదమూ దైవవాక్కూరెండూ మనకేలా ఆహారమౌతాయో వివరించండి.
7.క్రీస్తు నేనే మార్గాన్ని అనడంలో అర్థం ఏమిటి?
8.తొలి ఆదాముకీ రెండవ ఆదాముకీ గల వ్యత్యాసాలను పేర్కొని, మనం రెండవ ఆదాముని ఏలా పోలివుండాలో వివరించండి.
9.శిల అనే పదం యావేకూ క్రీస్తకీ ఏలా అన్వయిస్తుంది? మనం ఏలా సజీవశిలలం ఔతాం?
10.యావే, క్రీస్తు మనకు ఏలా రక్షకులౌతారు?
11.మెస్సీయా అనే పదం క్రీస్తుకి ఏలా అన్వయిస్తుందో వివరించండి.
12.యేసు నామం అర్ధమూ, ఆ నామ ప్రభావమూ తెలియజేయండి.
13.పెండ్లికుమారుడు లేక వరుడు అనే పదం యావేకూ క్రీస్తుకూ ఏలా వర్తిస్తాయో తెలియజేయండి. 14.యావే, క్రీస్తూ తోట కాపుల్లాంటి వాళ్ళయితే, యిస్రాయేలీయులూ క్రెస్తవులూ వాళ్ళ నాటిన ద్రాక్షతోట లాంటివాళ్ళు అనే భావాన్ని వివరించండి. క్రీస్తు ద్రాక్షలత ఐతే మనం అతనిలోనికి ෂණිභූඩ් వున్న రెమ్మలం అనే యోహాను భావాన్ని గూడ విశదీకరించండి.
15.యావే, క్రీస్తూ ఏలా మనకు జీవనదాత లౌతారో వివరించండి.
16.యావే, క్రీస్తూ ఏలా గృహనిర్మాత లౌతారో వివరించండి.
17.యావే చేసిన సీనాయి నిబంధనాన్నీ క్రీస్తు చేసిన నూత్న నిబంధనాన్నీ వివరించండి