పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.పూర్వవేదంలో నిబంధనం జరిగినప్పడు "నేను వారి దేవుణ్ణి, వాళ్లు నా ప్రజలు" అనే వాక్యం విన్పిస్తుంది. ఇవి దైవసాన్నిధ్యాన్ని తెలియజేస్తుంది. నూత్న వేదంలో మన సాన్నిధ్యం క్రీస్తే అతడు మనకు ఇమ్మానువేలు - మనతో వుండే దేవుడు.

3.పూర్వవేదంలో పశువుల నెత్తురు చిలకరించి పాప పరిహారమూ, నిబంధనమూ చేసారు, నూత్నవేదంలో క్రీస్తు నెత్తురు ద్వారా నిబంధనం జరిగింది, ఆ పశువుల రక్తంతో పోలిస్తే క్రీస్తు రక్తం ఎంతో పవిత్రమైంది. అమూల్యమైంది. కనుక అది మనకు చేకూర్చిపెట్టే రక్షణం పూర్వవేద రక్షణం కంటే గొప్పది.

4.నూత్న నిబంధనం వీలునామాలాంటిది. వీలునామాను వ్రాసినవాడు గతింపగనే అతని సొత్తు అతని వారసులకు లభిస్తుంది. కనుక క్రీస్తు మరణంతో అతని వారసులమైన మనకు అతని సొత్తయిన మోక్షం లభిస్తుంది - హెబ్రే 9,17. క్రీస్తు తాను జరిపిన నిబంధనం ద్వారా గొర్రెలకు కాపరి అయ్యాడు. ఆ గొర్రెలం మనమే - 13,20.

5.పూర్వవేద ప్రజలు సీనాయి నిబంధనం ద్వారా దేవుని ప్రజలయ్యారు. “విూరు నావారూ, నా సొంత ప్రజలూ ఔతారు. మిూరే నాకు యాజకరూపరాజ్యం, పవిత్ర ప్రజ” నిర్గ 19,5-6. పూర్వవేదానికి నిబంధన మేలాంటిదో నూత్నవేదానికి జ్ఞానస్నానం అలాంటిది. కనుక నూతవేదం జ్ఞానస్నానం పొందిన క్రైస్తవులకు పై నిర్గమ కాండంలోని వాక్యాలను అన్వయిస్తుంది. "మిూరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులం, పవిత్రమైన దేవుని సొంతప్రజలు" అని చెప్తుంది - 1పే 29. మనం ఈ వేద వాక్యాలకు తగినట్లు పవిత్రంగా జీవించాలి.

6.క్రైస్తవ ప్రజల్లో కొందరు దేవుని ప్రత్యేకమైన పిలుపును పొంది గురువులూ మఠకన్యలూ ఔతారు. ఈ పిలుపు కూడ నిబంధనం లాంటిదే. ఆ పిలువబడిన వారిలో గొప్ప యోగ్యత ఏమిూ లేకపోయినా దేవుడు కరుణతో వారితో నిబంధనం చేసికొంటాడు. ఆ పిలుపు మన యోగ్యత మిూద కాక దేవుని ప్రేమ మిూద ఆధారపడి వుంటుంది, “అతడు స్వయంగా మిమ్మ ప్రేమించాడు. కనుక మిమ్మే ఎన్నుకొన్నాడు" - ద్వితీ 7,8. కనుక ఈ పిలుపును పొందినవాళ్లు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞత చూపాలి.

7.క్రీస్తు చేసిన నిబంధనం మోక్షంలో గొర్రెపిల్ల వివాహంతో గాని సంపూర్ణం కాదు. "అటు తర్వాత నేను స్వర్గంలోని దేవుని నుండి దిగివచ్చే పవిత్ర నగరమైన యెరూషలేమను చూచాను. ఆమె తన భర్తను చేరబోవడానికి గాను అలంకరించుకొని సిద్ధంగా వున్న యువతిలా వుంది. అంతట ఒక దేవదూత నన్ను సమిపించి గొర్రెపిల్ల వధువైన యువతిని, నీకు చూపిస్తాను రా" అన్నాడు- దర్శ 21,2–9. అనగా నిబంధనం మనకు ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో ముగుస్తుంది.