పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నిన్ను ప్రజలకు నిబంధనంగాను
జాతులకు జ్యోతినిగాను నియమించాను
నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుస్తావు
బందీలను చెరనుండి వెలుపలికి కొనివస్తావు
చీకటిలో వున్నవారిని కారాగారం నుండి విడిపిస్తావు"

అని చెప్పాడు - 42,6-7. ఈ ప్రవచనంగూడ క్రీస్తునందు నెరవేరింది, ఇంకా, ఆ బాధామయ సేవకునిగూర్చి గూడ ప్రభువు

“అతన్ని బాధాభరితుని జేయాలనే నా సంకల్పం
అతని మరణం పాపపరిహారబలి అయింది
కనుక అతడు దీర్గాయువును బడసి
పత్ర పౌత్రులను జూస్తాడు"

అని చెప్పాడు - 53, 10-11. ఈ ప్రవచనంగూడ క్రీస్తు విషయంలో నెరవేరింది. యెషయా పేర్కొన్న బాధామయ సేవకుడు క్రీస్తేనని నూత్నవేదం పలుతావుల్లో చెప్తుంది. es క్రీస్తుద్వారా మనం పవిత్రాత్మను పొందాం. ఆ యాత్మ నూత్న ధర్మశాస్తాన్ని మన హృదయంలో లిఖిస్తుంది. ఈలాయిర్మీయా యెహెబేలు పల్కిన ప్రవచనాలు నెరవేరతాయి. క్రీస్తు మరణంద్వారా మనం తండ్రితో మళ్లా రాజీపడ్డాం -2 కొ 5,19.

క్రీస్తు చేసిన నిబంధనం పూర్వం మోషే చేసిన నిబంధనంకంటె గొప్పది. “మరింత గొప్పవైన విషయాలను గూర్చిన వాగ్దానాల మీద ఆధారపడివుంది కనుక, దేవునకు మానవులకు మధ్య క్రీస్తు ఏర్పరచిన నిబంధనం మరింత శ్రేష్టమైంది - హెబ్రే 8,6. "క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన క్రీస్తువద్దకు, రక్తంకంటె ఉత్తమ విషయాలను పేర్కొనే ప్రోక్షక రక్తం వద్దకు, మీరు వచ్చారు" - 12,24. నేడు మన క్రైస్తవ జీవితమంతా ఈ నిబంధన జీవితమే.

ప్రార్థనా భావాలు

1. ప్రభువు తన సిలువ మరణాన్ని సూచించే కడపటి విందును భుజిస్తూ "మిూరు నా జ్ఞాపకార్థంగా దీనిని చేయండి” అని ఆజ్ఞాపించాడు - 1కొ 11,24-25. నేడు మనమర్పించే పూజద్వారా ఈ యాజ్ఞను నెరవేరుస్తున్నాం. ఈ పూజలో అనుదినం క్రీస్తు నిబంధనను జ్ఞాపకం చేసికోవడం వల్లనే మనం రక్షణం పొందుతున్నాం. ఇంకా, పూర్వ నూత్న వేదాల్లో కూడ భోజనంతోనే నిబంధనం ముగుస్తుంది. నేడు మనకు దివ్యసత్ర్పసాదమే నిబంధన భోజనం. కనుక అది మనకు అతిపవిత్రమైంది.