పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ల బోధంతా నిబంధన నియమాలను గూర్చే వాళ్ళ ఉపదేశాల ప్రకారం, నిబంధనద్వారా దేవునికీ ప్రజలకీ మధ్య సఖ్యసంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ప్రజలు గొర్రెల మందయితే, ప్రభువు వారిని కాచి కాపాడే కాపరి. వాళ్లు ద్రాక్షతోటయితే, అతడు ఆ తోటకాపు. వాళ్లు ఇల్లయితే, అతడు ఆ యింటిని కట్టినవాడు. వాళ్ల వధువైతే అతడు ఆ కన్నెను పరిణయమాడిన వరుడు. వాళ్లు బిడ్డడైతే, అతడు వాళ్ళకు తండ్రి. ఈలాంటి ఉపమానాల ద్వారా ప్రవక్తలు ఒప్పందం భావాన్ని లోతుగా విశదీకరించి చెప్పారు. ఒడంబడిక వలన ఏర్పడిన సఖ్యసంబంధాలను ప్రజలు జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. అనగా దైవభక్తితో జీవిస్తూ ప్రభువు ఆజ్ఞలను ఖండితంగా పాటించాలి.

ఒప్పకోలునుగూర్చి మాట్లాడిన ప్రవక్తల్లో యిర్మీయాను విశేషంగా స్మరించు కోవాలి. ఈ ప్రవక్త ప్రజల పాపాలవలన సీనాయి నిబంధనం రద్దయిపోయిందని బోధించాడు, ఐనా ప్రభువు మంచివాడు కనుక భావికాలంలో ప్రజలతో నూత్ననిబంధనం చేసికొంటాడని వాకొన్నాడు. యిర్మీయా పలుకులను అతని ప్రవచనం 31, 31-34 వచనాల్లో చూడవచ్చు. ఇవి పూర్వవేదంలోని అతి ప్రశస్త వచనాలకు చెందినవి. ఈ వాక్యాల ప్రకారం 1. ప్రభువు యిస్రాయేలీయుల పాపాలను మన్నిస్తాడు (34). 2. ప్రజలు తమ పాపాలకు తామే వ్యక్తిగతంగా బాధ్యులౌతారు (29) 3. ఇకమీదట వట్టి కర్మకాండతో గూడిన మతంగాక హృదయగతమైన మతం ప్రారంభమౌతుంది. "నేను నా ధర్మశాస్తాన్నివాళ్ళ అంతరంగంలో వుంచుతాను. వాళ్ళ హృదయాలపై లిఖిస్తాను" అన్నాడు ప్రభువు-81,33. ప్రభువు మోషే ధర్మశాస్తాన్ని కేవలం రాతిపలకలపై వ్రాసి యిచ్చాడు కదా! క్రీస్తు సిలువపై మరణించి నూతనిబంధనాన్ని నెలకొల్పడంతో ఈ యిర్మియా ప్రవచనం నెరవేరింది. క్రీస్తు "ఇది అనేకుల పాపపరిహారార్థమై చిందబడనున్న నూత్న నిబంధనంయొక్క నా రక్తం. అన్నాడు- మత్త 26,28. ఈ "నూత్న నిబంధనం" యిర్మీయా పేర్కొన్నదే.

నిబంధనాన్ని పాటించడానికి ప్రధాన కారణం దేవునికి ప్రజలపైవున్న ప్రేమేనని చెప్పంది ద్వితీయోపదేశకాండ. ఆనాడు అన్నిజాతులుండగా ప్రభువు యిప్రాయేలుని మాత్రమే ఎందుకెన్నుకొన్నాడు? వారి యోగ్యతను బట్టి కాదు. తనకు వారిపైగల ప్రేమచేతనే - 7 6-7. కనుక ఆ నిబంధనాన్నిపాటించడం జీవం. దాన్నివిస్మరించడం మరణం – 30, 15.

3.శిక్ష

నరుల హృదయం పాపభూయిష్టమైంది. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా యిస్రాయేలీయులు ప్రభువు నిబంధనాన్నిపాటించలేదు. అతని ఆజ్ఞలను ఖాతరు చేయలేదు. కనుక ప్రభువు వారి పట్టణాన్నీ దేవాలయాన్నీ సర్వనాశం చేయించాడు. వారిని నేబుకద్నెసరు