పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినండి! మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణహృదయంతో పూర్ణమనస్సుతో పూర్ణశక్తితో ప్రేమించండి. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ యాజ్ఞలను ఏనాడూ విస్మరించకండి" ద్వితీ 6, 4-5. యి(సాయేలీయులు ఈలా భక్తి చూపిస్తే ప్రభువు వారికి చేసిన వాగ్దానాలన్నిటినీ నిలబెట్టుకొంటాడు. అనగా వారిని మహా జాతినిగా అభివృద్ధి చేస్తాడు. కనాను దేశాన్ని వారికి శాశ్వతంగా భుక్తంచేస్తాడు. ఈలా దేవుడూ ప్రజలూ కలసి వుండడమే నిబంధనం ప్రయోజనం.

కాని ఈ సీనాయి వొడంబడికలో కొన్ని లోపాలు కూడ వున్నాయి. 1. ప్రభువు యిస్రాయేలు జాతితో మాత్రమే వొప్పందం చేసికొన్నాడు. మరి ఆనాడున్న ఇతర జాతుల సంగతియేమిటి? రక్షణం అన్ని జాతులకూ అవసరం కాదా? అతడు అన్ని జాతులకూ ప్రభువు కాడా? 2. నిబంధనం యిస్రాయేలీయుల నమ్మదగినతనం మీదనే ఆధారపడి వుంటుంది, కాని వాళ్ళ విశ్వసనీయంగా ప్రవర్తించలేదు. కనుకనే సీనాయి నిబంధనం కోరుకొన్న ఫలితానీయలేకపోయింది. 3. ఈ నిబంధనం యూదుల భూలోక రాజ్యాన్నిగూర్చి మాట్లాడుతుందేగాని పరలోక రాజ్యాన్నిగూర్చి మాట్లాడదు. ఇక్కడ రక్షణమంటే ప్రధానంగా ఇహలోక సౌఖ్యాలు. మోక్షరాజ్యంకాదు. ఆలాంటప్పడు ఈ నిబంధనం విలువ ఏపాటిది? ఈలాంటి లోపాలు కొన్ని వున్నా సీనాయి నిబంధనం చాల ప్రాముఖ్యమైంది. యూదుల భావి చరిత్ర అంతా దీనిమీదనే ఆధారపడి వుంటుంది. దీనిని పాటించినంతకాలం వాళ్ళకు మేళ్ళు కలుగుతాయి, పాటించనంతకాలం వినాశం దాపరిస్తుంది.

3. యిప్రాయేలు జీవిత చరిత్రలో నిబంధనం ప్రాముఖ్యం

1. నిబంధన నూళ్నీకరణం

నిబంధనను చేసి కొన్న ఉభయువక్షాలవాళ్ళు దాన్ని చాలసారు నూతీకరించుకొనేవాళ్ల కావున యిస్రాయేలీయుల చరిత్రలోకూడ నిబంధన నూతీకరణలు చాల కన్పిస్తాయి. దావీదుని హెబ్రోనున యిస్రాయేలీయులందరికీ రాజునుగా అభిషేకించారు. ఆ సమయంలో రాజూ, ప్రజల పెద్దలూ ఒడంబడికను నూతీకరించుకొన్నారు- 2సమూ 5,3. సాలోమోనురాజు దేవాలయాన్ని కట్టి దానికి ప్రతిష్ట చేసినపుడుకూడ నిబంధనాన్ని నూతీకరించాడు- 1రాజు 8,22-30. యోషీయారాజు గొప్ప మతసంస్కరణలను ప్రారంభించినవాడు, అతడు కూడ నిబంధన నూతీకరించాడు-2 రాజు 23,1-3. ఈ నూళ్నీకరణాల భావమేమిటంటే ప్రజలు నిబంధన షరతులను అధికాధికంగా పాటించడమే.

2. ప్రవక్తల హెచ్చరికలు

యిప్రాయేలీయుల చరిత్రలో ప్రవక్తలు చాల పెద్దపాత్ర నిర్వహించారు. వాళ్లు ప్రజలను నిబంధన షరతులను పాటించండని నిరంతరం హెచ్చరిస్తుండేవాళ్లు, అసలు 237