పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అతన్ని కొలిచి అతనిద్వారా పవిత్రులౌతారు. నిబంధనాన్ని అతడే కరుణతో ప్రారంభించాడు. ఆ ప్రజలకు అతనితో ఒడంబడిక చేసికొనే యోగ్యత ఏమీలేదు.

ఒకమారు యిస్రాయేలీయులు ఆ ప్రభువు ప్రజలయ్యాక అతడేవాళ్ళను కాచి కాపాడాడు. అంతకుముందే అతడు వాళ్ళను గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొని వచ్చినట్లుగా ఐగుప్తనుండి మోసికొనివచ్చాడు- 19,4 ఇప్పడు ప్రభువు తన దూతను వారికి ముందుగా పంపుతాడు. అతడు వాళ్ళను సురక్షితంగా వాగ్దత్తభూమికి తీసుకవెళ్లాడు - 23, 20-21.\

2. నిబంధన షరతులు

నిబంధనలన్నిటిలోను ఉభయపక్షాల తరపున షరతులుంటాయి. ప్రభువు తన తరపున తాను యిస్రాయేలుకు కనాను మండలాన్ని శాశ్వతంగా భుక్తం చేస్తాడు. వాళ్ళను a.s es"&rP తీర్చిదిద్ది శత్రుజాతులనుండి కాపాడతాడు. ప్రజలు తమ తరపున తాము యావే ప్రభువును మాత్రమే కొలవాలి, అన్యదైవాలను పూజింపకూడదు. ఇంకా అతడు మోషేద్వారా దయచేసిన ధర్మశాస్తాన్ని ఖండితంగా పాటించాలి - నిర్గ 20,3. వీటిల్లో యావే తన షరతులను ఎల్లవేళలా పాటించాడు. కాని ప్రజలుమాత్రం తమ షరతులను పాటించేవాళ్లు కాదు. కనుకనే వాళ్లు బాబిలోనియా ప్రవాసశిక్షకు గురయ్యారు.

3. ఒప్పందం ముగింపు

ఒప్పందం ముగింపునుగూర్చి రెండు సంప్రదాయాలున్నాయి. మొదటి సంప్రదాయం ప్రకారం మోషే 70మంది పెద్దలతో కొండమీద దేవుని యెదుట భోజనం చేయడంతో నిబంధనం ముగిసింది - 24,9-11. రెండవ సంప్రదాయం ప్రకారం, మోషే బలిపీఠం మీదా ప్రజలమీదా నెత్తురు చిలకరించడంతోనే నిబంధన ముగిసింది - 24, 3–8.

ప్రజలు నిబంధనాన్ని గుర్తుంచుకోవాలి కదా! అందుకొరకు ప్రభువు తాను దయచేసిన పదియాజ్ఞలను మందసంలో పెట్టి వుంచుకొమ్మని మోషేను ఆజ్ఞాపించాడు. ఆ పెట్టెమీదినుండే దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు - 25, 21-22. ఇంకా ఈ మందసాన్ని గుడారంలో పెట్టించమని కూడ దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ గుడారం రాబోయే దేవాలయానికి సూచనగా వుంటుంది. ఈ గుడారంలోనే యిప్రాయేలీయులు ప్రభువును సంప్రతించేవాళ్ళ -33, 7-11. కనుక మందసమూ గుడారమూ ప్రజలు ప్రభువును పూజించే తావులు. అతని ఆజ్ఞలను స్వీకరించే తావులు. అవి రెండు కలసి యెడారి కాలంలో యిస్రాయేలీయులకు దేవాలయమయ్యాయి.

4. నిబంధనం భావం, దాని లోపాలు

సీనాయి నిబంధనం పరమార్థమేమిటి? యిప్రాయేలీయులు ప్రభువుని భక్తితో పూజించాలి. అతని ఆజ్ఞలను తుచ తప్పకుండా పాటించాలి. “యిస్రాయేలీయులారా