పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పౌలుకూడ "యేసుక్రీస్తు అనే దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడూ వేయలేడు" అని వాకొన్నాడు 1కొ3,11. ఈ పునాదిరాతిమీదనే తర్వాత క్రైస్తవ సమాజం నిర్మింపబడుతుంది. క్రీస్తు పునాదిరాయిూ, దానిమీద కట్టిన మందిరంకూడ. అనగా అతడు భవనమూ, భవన నిర్మాతాకూడ.

పూర్వవేద దేవాలయం నాశమౌతుంది. దానికి బదులుగా నూత్నదేవాలయం నెలకొంటుంది. క్రీస్తు మీరు "ఈ యాలయాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో లేపుతాను" అన్నాడు. అతడు తన శరీరాన్నిగూర్చే యిూలా చెప్పాడు. ఉత్తానక్రీస్తు అతని అనుయాయులు కలసి ఈ యాలయమరొతారు— యోహా 2,19–22. ఈలా అతడు దేవాలయ నిర్మాత, నూత్న వేదప్రజల నిర్మాత.

2. క్రీస్తు శరీర నిర్మాణం

పౌలు శ్రీసభను, అనగా నూత్నవేద ప్రజను, క్రీస్తు శరీరం అని పిల్చాడు. యావే పూర్వవేద ప్రజను నిర్మించినట్లే క్రీస్తు నూత్నవేద ప్రజను నిర్మిస్తాడు.

1. నేను నా శ్రీసభను నిర్మిస్తాను

ప్రభువు పేత్రుతో "నీ పేరు కయిఫా, లేక రాయి. ఈ రాతిమీద నా సమాజాన్ని నిర్మిస్తాను. నరక శక్తులు దాన్ని జయించలేవు" అని చెప్పాడు - మత్త 16,18, యావే ప్రభువు పూర్వవేద ప్రజను అబ్రాహామనే శిలమీద నిర్మించాడు. ఆలాగే క్రీస్తుకూడ నూతవేదప్రజను పేత్రు అనే శిలమీద నిర్మిస్తాడు. ఈ ప్రజ క్రీస్తు శరీరం, శ్రీసభ, అది భవనం లేక శరీరంగా ప్రేమద్వారా నిర్మింపబడుతుంది. "ప్రతి అవయవం సక్రమంగా పనిచేస్తే దేహమంతా ప్రేమద్వారా పెంపొందుతుంది" - ఎఫె 4,16.

2. భవన నిర్మాతలు అపోస్తలులు

అపోస్తలులు శ్రీసభ అనే భవనానికి పునాదులు - ఎఫె 2,20, వాళ్ళ రకరకాల ಕ್ಲಿಪ್ಸ್ సమాజాలను తయారుచేసి శ్రీసభ అనే భవనాన్ని పెద్దదిగా కట్టారు, పౌలు తన్ను క్రీస్తుకి తోడిపనివానినిగా ఎంచుకొన్నాడు - క్రీస్తూ తానూ కలసి దైవప్రజ అనే భవనాన్ని నిర్మిస్తామని పల్మాడు - 1 కొ3,9-10. కాని ఈ భవనానికి మూలరాయి లేక పునాదిరాయి ఎప్పడూ క్రీస్తే. ఇక్కడ అపోస్తలులు భవన నిర్మాణంలో క్రీస్తుకి సాయపడినా ప్రధాన నిర్మాతేమో ఎప్పడూ క్రీస్తే.

8. నిర్మింపబడే భవనం శ్రీ సభే

“ఆధ్యాత్మిక దేవాలయాన్ని నిర్మించడంలో మీరు సజీవులైన శిలలుగా ఉపయోగపడండి" అంటుంది మొదటి పేత్రు జాబు - 2,3–5. అనగా క్రీస్తు అనే పునాదిరాతిమీద నిర్మింపబడిన భవనం క్రైస్తవ సమాజం. ఈ భవనంలోని రాళ్ల క్రైస్తవులమైన