పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాశం చేయడానికీ పడగొట్టడానికీ
పునర్నిర్మించడానికీ నాటడానికీ సమర్థుడ వాతావ"

అని చెప్పాడు - 1,10. ప్రజలు తన కెదురు తిరిగి బాబెలు గోపురాన్ని కట్టబోతే అతడు దాన్ని ఆపుజేయించాడు - ఆది 11,1-9, అది ధ్వంసమైపోయింది. ఐనా ప్రభువు పడగొట్టడానికంటె నిర్మించడానికి సిద్ధంగా వుంటాడు. కనుకనే ఆమోసు ద్వారా

"నేను కూలిపోయిన కుటీరంలా వున్న
దావీదు రాజవంశాన్ని పునర్నిర్మిస్తాను
ఆ యింటి గోడలను బాగుచేసి
దానిని తిరగి కట్టి పూర్వస్థితికి కొనివస్తాను”

అని చెప్పించాడు - 9,11. ఇంకా అతడు యెషయా ముఖాన

"ప్రభువైన యావే యీలా అంటున్నాడు
నేను సియోనున ఒక పునాదిరాయి వేస్తున్నాను
ఆ మూలరాయి విలువకలది, పటిష్టమైంది
విశ్వాసం కలవాడు చలింపడు"

అని పలికించాడు - 28,16. ఈ పునాదిరాయి మెస్పీయాయే. ఆ మెస్సీయా చుటూ అతని శిష్యులైన "శేషజనం" ప్రోగౌతుంది. వాళ్లు ప్రభువు ప్రజలుగా వ్యాప్తిజెందుతారు. దేవుని కృపవలన యిప్రాయేలీయులు బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగివచ్చి పాడువడివున్న తమ నగరాన్నీ దేవాలయాన్నీ పునర్నిర్మించుకొంటారు. ఆలాగే ప్రభువు కూడ తమ పాపాలవలన ప్రపంచం నలుమూలలా చెల్లాచెదరైయున్నయిస్రాయేలీయులను మళ్ళా యెరూషలేములో ప్రోగుజేసి వారి జాతిని పునర్నిర్మిస్తాడు. ఈ "పునర్నిర్మాణం" అనేది పూర్వవేదంలో చాలతావుల్లో యిప్రాయేలీయులు భవనాలకీ వారి జాతికీగూడ వర్తిస్తుంది. వారి యిండల్లా నగరాలూ పెరిగినట్లే వారి జనసంఖ్యకూడ పెరుగుతూంటుంది.

3. పునాదిరాయి మెస్సీయాయే

కీర్తనకారుడు "ఇల్లకట్టేవాళ్లు పనికిరాదని నిరాకరించిన రాయే చివరకు మూలరాయి ఐoది' అన్నాడు–118,22. ఇక్కడ ఈ కీర్తనకారుని దృష్టిలో "నిరాకరింపబడినరాయి" బాబిలోనియా ప్రవాసంనుండి తిరిగి వచ్చిన యిప్రాయేలీయులే. వీళ్ళే "శేషజనం" అనగా ప్రభువు ఎన్నుకొన్నవారిలో మిగిలివున్నవాళ్ళు. ఐతే, నూతవేదంలో మొదటి పేత్రు జాబు ఈ మూలరాయి క్రీస్తేనని చెప్తుంది - 2,7. పూర్వవేదంలోని శేషజనమే నూత్నవేదంలో మెస్సీయాగా అతని ప్రజలుగా మారిపోతారు. మెస్సీయా బైబుల్లో సామూహిక వ్యక్తి అతడు కొన్ని తావుల్లో ఏక వ్యక్తిగాను, కొన్ని తావుల్లో ఒక సమూహంగాను కన్పిస్తాడు. కనుక క్రీస్తూ శేషజనమూ కలసిపోతారు.