పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానస్నానవిధులను పాటించడమే. ఏమిటివి ఈ విధులు? పాపానికి చనిపోవవడమూ, వరప్రసాద జీవితాన్ని జీవించడమూను. దీన్నే పౌలు క్రొత్త జీవితమని, దత్తపుత్రుల జీవితమనీ, క్రీస్తుని ధరించడమనీ నానావిధాలుగా వర్ణించాడు.

జ్ఞానస్నానంలోనే మనకు ఆత్మ అనుగ్రహింపబడుతుంది. ఈ ఆత్మ మనలను రోజురోజుకీ క్రీను చెంతకు చేరుస్తూంటుంది. మనలో క్రీసు రూపురేఖలు తీర్చిదిద్దుతూంటుంది.

జ్ఞానస్నానం జీవితం ఒక రోజుతోగాని ఒక ఏడాదితో కాని ముగిసేదికాదు, జీవితమంతా కొనసాగేది. ఈ మధ్యలో మనం కొన్నిసార్లు కాలుజారి పడిపోతూంటాంకూడ. అలాంటప్పడు జ్ఞానస్నానమిచ్చే వరప్రసాద సహాయంతో బలంపుంజుకొని మళ్ళా దివ్యజీవితం జీవిస్తూండాలి.

జ్ఞానస్నానాన్ని గూర్చిన పైతలంపులు దివ్యమైన భావాలను కలిగించాలి. ఆ ప్రభువు మనకు భౌతిక జీవం మాత్రమేకాదు. ఈ జ్ఞానస్నానంద్వారా ఆధ్యాత్మిక జీవంగూడ ప్రసాదించాడు. దీనిద్వారా మనం దివ్యలంగా జీవించగలం. ఓనాడు ఆ ప్రభువు దివ్యధామంలో ప్రవేశించగలం. జ్ఞానస్నానంద్వారా మనం క్రీస్తుతో ఐక్యమౌతాం. అతనితో మనకు సహవాసం లభిస్తుంది - 1కొ 1,9. ఇందుకు మనం కృతజ్ఞలమై యుండాలి.

ప్రార్థనా భావాలు

1. ప్రభువు సొంత పేరు యేసు. హీబ్రూ భాషలో ఈ పేరు 'యెహోషువా" అని వుంటుంది. అది ఆ భాషలో యెహో + యాషా అనే రెండు పదాల సంయోగం. “యావే ప్రభువు రక్షణం" అని ఈ పదాల అర్థం. అనగా తండ్రి తన ప్రతినిధియైన మెస్సీయాద్వారా ప్రజలను రక్షిస్తాడని భావం. కనుకనే యేసు అనే పేరుకి రక్షకుడు అనే అర్థం రూఢమైంది. దేవదూత యోసేపుతో "అతడు తన ప్రజలను పాపంనుండి రక్షిస్తాడు. కనుక అతనికి యేసు అనే పేరు పెట్టాలి" అని చెప్పాడు - మత్త 1, 21. ఎడారిలో వెూషే కంచు నర్పాన్ని పైకెత్తి చూపించినట్లే మనుష్యకుమారుణ్ణిగూడ సిలువమీద కెత్తుతారు. అతనివైపు చూచి అతన్ని విశ్వసించేవాళ్ళకి రక్షణం లభిస్తుంది - యోహ 3, 14-15. యేసు అనే పేరులో ఆ ప్రభువు రక్షణమంతా యిమిడివుంది. కనుక ఆ దివ్యనామంపట్ల మనకు అపారమైన భక్తి వుండాలి.