పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశ సంస్కృతికీ భాషకీ తగినట్లుగా అనువదించలేం. వాటిల్లో ఈ ద్రాక్షరస పానీయంకూడ వొకటి. కొందరు అన్యమతస్తులు మనం పూజలో పుచ్చుకొనే దివ్యరక్తాన్ని కూడ సరిగా అర్థం చేసికోలేరు. అది మద్యపానం అంటారు. ఇది శోచనీయం.

4. ద్రాక్షరసం ఆనందానికిగూడ చిహ్నం. కీర్తనకారుడు చెప్పినట్లు, ద్రాక్షరసం మనకు
ఆనందాన్ని కలిగిస్తుంది - 104, 15. నిజమైన ద్రాక్షలతా, ద్రాక్షరసమూ ఐన క్రీస్తు నూత్నవేద ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తాడు. అతడు "నా యానందం మీయందు వండాలనీ, మీ యానందం పరిపూర్ణం కావాలనీ నేను ఈ సంగతులను మీకు చెప్మన్నాను" అన్నాడు - యోహా 15,11.

5. కొమ్మల గొప్ప తల్లిచెట్టుతో ఐక్యమైయుండడంలోనే వుంది. ఆలాగే మన గొప్ప క్రీస్తుతో ఐక్యమై యుండడంలోనే వుంది. పాపాన్ని కట్టుకొని క్రీస్తునుండి విడివడిపోతే మనం చిల్లిగవ్వకుగూడ పనికిరాం. మన పరిస్థితి ఎండిపోయిన కొమ్మలను తగలబెట్టినట్లుగానే వుంటుంది. కనుక ఈ భావాన్నితెలియజేసే యోహాను 15,5- 6 వాక్యాలు పలుసార్లు భక్తితో మననం చేసికోదగ్గవి.

15. జీవమయుడు


బైబులు భగవంతుడు, సజీవుడూ, జీవమయుడూ, అతడు నరులకు జీవాన్ని
ప్రసాదిస్తాడు. అదేలాగో చూద్దాం.
 

1. సజీవుడైన దేవుడు


బైబులు పేర్కొనే దేవుడు సజీవుడు. కనుకనే కీర్తనకారుడు "సజీవుడవగు దేవుడవైన
నీ కొరకు నేను ఆరాటపడుతున్నాను" అంటాడు - 42,2. ఆ దేవునితో పోలిస్తే విగ్రహాలు నిర్జీవాలు, శక్తిరహితాలు. కీర్తనకారుడు వాటిని ఈలా వర్ణించాడు
“వారి విగ్రహాలను వెండిబంగారాలతో జేసారు
నరుల హస్తాలే వాటిని మలచాయి
వాటికి నోళ్లున్నాయి కాని మట్లాడలేవు
కన్నులున్నాయి కాని చూడలేవు
చెవులున్నాయి కాని వినలేవు
ముక్కులున్నాయి కాని వాసన చూడలేవు
చేతులున్నాయి కాని స్పృశించలేవు
కాళ్లున్నాయి కాని నడువలేవు