పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రాగేపుడల్లా నా జ్ఞాపకార్థంగా త్రాగండి" అన్నాడు. కనుక మనం ఆ ప్రభువు రొట్టెను తిన్నపుడూ, ఆ పాత్రంనుండి త్రాగినపుడూ, ప్రభువు మళ్లా రెండవసారి వచ్చేవరకూ అతని మరణాన్ని ప్రకటిస్తూంటాం - 1 కొరి 11, 25-26. దివ్య సత్రసాదవిధిలో ఈలాంటి నిగూఢభావాలు వున్నాయి.

2. ద్రాక్షరసం నిబంధనాన్నిగూడ సూచిస్తుంది. నిబంధన సమయంలో బలినర్పించాలి, జంతువు నెత్తురు కార్చాలి. ఈ బలిలో ద్రాక్షరసాన్ని పానీయార్పణంగా పోస్తారు. జంతువు రక్తానికి బదులుగాగాని, ఆ రక్తంతోపాటు గాని రసాన్ని కుమ్మరిస్తారు - ద్వితీ 32,28. ఇక క్రీస్తు మనతో నూత్ననిబంధనం చేసికొంటూ సిలువపై తన సొంత నెత్తురునే కార్చాడు. అతడు ఆ నెత్తురికి సంకేతంగా కడపటి విందులో ద్రాక్షసారాయాన్ని వాడాడు, కనుకనే "ఈ పాత్రం మీ కొరకు చిందబడే నా రక్తంతోనైన క్రొత్త నిబంధనం" అన్నాడు - లూకా 22,20, కనుక ద్రాక్ష సారాయరూపంలో వున్న అతని రక్తం నూత్న నిబంధనానికి చిహ్నమౌతుంది, క్రొత్త రసాన్ని క్రొత్త తిత్తుల్లో పోస్తారనే క్రీస్తవాక్యంగూడ ఈ నూతవేద నిబంధననే సూచిస్తుంది - మత్త 9,17.

3. ద్రాక్షరసం విందుకీ, దివ్యసత్ర్పసాదానికీ మోక్షానికీ గూడ చిహ్నంగా వుంటుంది. యూదులు విందుల్లో ఈ రసాన్ని తనివితీర త్రాగేవాళ్లు, కనుక అది విందుకి చిహ్నమైంది. ఇంకా యూదులు స్వర్గాన్ని కూడ గొప్ప విందుతో పోల్చేవాళ్లు. ఈ భావాలన్నీ మనసులో పెట్టుకొనే క్రీస్తు "ఇది మొదలుకొని మీతో కలసి నూత్నంగా నా తండ్రి రాజ్యంలో ద్రాక్షరసాన్ని పానంచేసేవరకూ దాన్ని మళ్లా ముట్టుకోను" అన్నాడు - మత్త 26,29. అనగా మోక్షపు విందులో మనం క్రీస్తుతోపాటు మల్లా ద్రాక్షరసాన్ని పానం చేస్తాం. అనగా క్రీస్తుతోపాటు మనంకూడ మోక్షభాగ్యాన్ని అనుభవిస్తామని భావం.

ద్రాక్షరసానికి బైబుల్లో ఇన్ని సాంకేతికార్ధలున్నాయి. ఒక విధంగా చెప్పాంటే అది యూదులకు పవిత్రమైంది. వాళ్ళకు అది రోజువారి పానీయం. భోజనంలో వో భాగం. కనుకనే పరిసయులు తన్ను "మద్యపాన ప్రియుడు" అని నిందించినా లెక్కచేయకుండా క్రీస్తువిందుల్లో ద్రాక్షరసాన్ని పుచ్చుకొన్నాడు - మత్త 11,9. ఆరోగ్యం కొరకు కొంచెం ద్రాక్షరసం త్రాగుతూండమని పౌలు తన శిష్యుడైన తిమోతికి సలహా యిచ్చాడు - 1తి మొు 5,28.

కాని మన దేశంలో ద్రాక్షరసానికి ఈ పవిత్రభావాలు లేవు. ద్రాక్షరసం త్రాగడమంటే మనకు మధ్యపానం క్రిందే లెక్క బైబుల్లోని కొన్ని భావాలను మన