పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెట్టునుండి కొమ్మలను నరికివేస్తే ఇక తల్లిచెట్టు సారం వాటిల్లోనికి రాదు. అవి యెండిపోతాయి. ఆలాగే పాపంవల్ల మనం క్రీస్తునుండి విడివడిపోతే ఇక అతని వరప్రసాదం మనలోనికి రాదు. కనుక మనం భౌతికంగా గాకపోయినా ఆధ్యాత్మికంగా చస్తాం. ఈ భావాలన్ని యోహాను 15, 5-6లో కన్పిస్తాయి. మనం క్రీస్తుతో ఐక్యమైయుండి అతని వరప్రసాదబలంతో చక్కగా ఫలిస్తే తండ్రిని కీర్తిస్తాం 15,8. మన యీ సత్ఫలితాన్ని చూచి మనమే సంతోషించవచ్చు. క్రీస్తుకూడ సంతోషిస్తాడు - 15,11.

ఈలా యోహాను ద్రాక్షలత రెమ్మలు అనే వుపమానంతో మనం క్రీస్తులోనికి ఐక్యమై దివ్యజీవనం జీవిస్తామనే భావాన్ని నూత్నంగాను సుందరంగాను చెప్పాడు. నూత్న వేదంలో మరెక్కడా ఈ భావం తగలదు.

ప్రార్థనా భావాలు

1. ద్రాక్షరసానికి బైబుల్లో చాల సాంకేతిక భావాలున్నాయి, ఇక్కడ కొన్నిటిని పరిశీలిద్దాం. ఇది శ్రమలకూ, నెత్తురు కార్చడానికీ చిహ్నంగా వుంటుంది. ప్రభువు కోపంతో తన శత్రువులను శిక్షించి శ్రమపెట్టడాన్ని ద్రాక్షపండ్లను తొక్కి రసం
తీయడంతో పోలుస్తుంది పూర్వవేదం
"ద్రాక్షపండ్లను నలగతాక్కి రసంతీసేవానివలె
నీ దుస్తులు ఎర్రగా వున్నాయేల?
నేనొక్కడనే జాతులను ద్రాక్షపండ్లలా నలగడ్రొక్కాను
నేను కోపంతో జాతులను నలగడ్రొక్కాను
వారి నెత్తురు నా బట్టలమీద చిందిపడగా
నా దుస్తులకు మరకలయ్యాయి" — యొష 63, 2-3
ఇక్కడ యావే శత్రువులు అతని శిక్షవల్ల నలిగిపోయి ద్రాక్షపండ్ల రసాన్ని కార్చినట్లుగా నెత్తురు కార్చారని భావం.

ద్రాక్షరసం నెత్తురులా ఎర్రగా వుంటుంది. కనుక అది నెత్తురు కార్చడానికికూడ చిహ్నమైంది. క్రీస్తు అంత్యభోజన సమయంలో శిష్యులకు ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఆ రసం అతడు కార్చబోయే నెత్తురుకే చిహ్నం, కనుకనే అతడు శిష్యులకు ద్రాక్షరసం పాత్రను ఇచ్చి మీరందరు దీనిలోనిది త్రాగండి. හුධි అనేకుల పాపపరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు - మత్త 26,27-28. నేడు మనం ఆ పాత్రంలోని దివ్యరక్తాన్ని త్రాగినపుడల్లా క్రీస్తు శ్రమలనూ మరణాన్నీ గుర్తుతెచ్చుకొంటాం. అందుకే అతడు “ఈ పాత్రం నా రక్తంద్వారా నెలకొన్న దేవుని నూత్న నిబంధనం. మీరు దీన్ని