పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇవన్నీ ప్రభువు యిస్రాయేలుతో చేసికొన్న నింధనను విపులీకరించి చెప్పే భావాలు.

ఇంతవరకు మనం వరుని, లేక పెండ్లికుమారుని గూర్చిన పూర్వవేద భావాలను చూచాం. ఇక నూత్న వేదంలో తండ్రికి మారుగా కుమారుడు కన్పిస్తాడు. యావే స్థానాన్ని క్రీస్తు పొందుతాడు. క్రొత్త యిస్రాయేలనే వధువుకి అతడే వరుడు లేక పెండ్లికుమారుడు. కనుకనే అతడు తన్ను గూర్చి చెప్పకొంటూ “పెండ్లికుమారుడు ఉన్నంతకాలం పెండ్లికి వచ్చినవాళ్లు చింతించరుకదా? పెండ్లికుమారుడు వారివద్దనుండి వెళ్ళిపోయేరోజులు వస్తాయి. అప్పడు వాళ్లు ఉపవాసం చేస్తారు" అని నుడివాడు- మత్త 9,15. ఇక్కడ పెండ్లికుమారుడు క్రీస్తే, ఇతని వధువు నూత్నవేద ప్రజలు. పెండ్లికుమారుడు తన ప్రజలనుండి వెళ్లిపోవడం అంటే క్రీస్తు సిలువమరణం.

స్నాపక యోహాను క్రీస్తుని చూచి "పెండ్లికొమార్తె పెండ్లికుమారుని సాత్తు, పెండ్లికుమారుని మిత్రుడు అతని చెంతనుండి అతడు చెప్పినట్లు చేస్తాడు. అతని స్వరం విని మిక్కిలి ఆనందిస్తాడు. అంటాడు - యోహా 8,29. ఈ వాక్యంలో పెండ్లికుమారుడు క్రీస్తు. అతని వధువు నూత్నవేద ప్రజలు. అతని మిత్రుడు స్నాపక యోహానే.

ప్రభువ మత్తయి 22, 1-14లో వివాహపు విందును గూర్చిన సామెతను చెప్పాడు. ఇక్కడ వివాహం జరిగింది దేవుని కుమారుడైన క్రీస్తుకే ఈ వివాహంలో క్రీస్తు పూర్వవేద ప్రజయైన యిస్రాయేలు అనే వధువుని తిరస్కరిస్తాడు. తిరుసభ అనే నూత్న వధువును స్వీకరిస్తాడు. అనగా మెస్సీయా పూర్వవేదపు యూదులను విడినాడి నూత్నవేద ప్రజలను స్వీకరిస్తాడని భావం.

ఇంకా ప్రభువు పదిమంది కన్నెల సామెత కూడ చెప్పాడు - మత్త25, 1-15, ఈ సామెతలోని పెండ్లి కుమారుడు గూడ క్రీస్తే, అతని వధువు తిరుసభే.

ఈ వుదాహరణలన్నింటినిబట్టి పూర్వవేదంలో యావేలాగ, నూత్నవేదంలో క్రీస్తు వరుడు, లేక పెండ్లికుమారుడు అనుకోవాలి. పూర్వవేదంలో యిప్రాయేలు యావే వధువైతే నూత్నవేదంలో క్రైస్తవులు క్రీస్తు వధువు ఔతారు. పూర్వవేదంలో లాగే ఇక్కడకూడ మళ్ళా మూడంశాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

4. జ్ఞానస్నానపు వధువు

పూర్వవేదంలోని నిబంధనకు తుల్యమైంది నూత్న వేదంలోని మన జ్ఞానస్నానం. అక్కడ నిబంధనం ద్వారా యిప్రాయేలీయులు దేవుని ప్రజలై అతని వధువయ్యారు. ఇక్కడ జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తు ప్రజలమై అతని వధువుమౌతాం. కనుకనే పౌలు క్రీస్తుని విశ్వసించిన కోరింతు క్రైస్తవుల నుద్దేశించి మాట్లాడుతూ "మీరు నేను ఏకైక వరునికి,