3.బెర్నార్డ్ భక్తుడు యేసు నామాన్నిస్తుతిస్తూ ల్యాటిన్ భాషలో పెద్ద గేయం వ్రాసాడు. ఆపాట "ప్రభూ! మాధురీమయమైన నీ నామాన్నిస్మరించుకొన్నంత మాత్రన్నేనా హృదయంలో ఆనందం పెల్లుబుకుతూంటుంది” అనే మాటలతో ప్రారంభ మౌతుంది, మనదేశంలో కూడ భగవంతుని సహస్రనామాలను (వేయి పేర్లను) జపించడం సంప్రదాయం. మనంకూడ యేసు అనే తిరునామాన్ని భక్తితో జపించవచ్చు. విశేషంగా భయాల్లో ఈ నామాన్ని జపిస్తే ఆ భయాలు తీరిపోతాయి. గండాల్లో ప్రమాదాల్లో ఈ నామాన్ని జపిస్తే భద్రత కలుగుతుంది. శోధనల్లో ఈ నామాన్ని జపిస్తే వరప్రసాదబలం చేకూరుతుంది. ఇంత శక్తి కలది ఈ పవిత్ర నామం.
4. యేసు క్రీస్తు సేవకు మన జీవితాన్ని అర్పించుకోవడం మహాభాగ్యం - అచ.15,26. యేసు నామం కొరకు ప్రాణాలను గూడ త్యాగం చేయడం ఇంకా దొడ్డ భాగ్యం- 21,13.
13. వరుడు-వధువు
పూర్వవేదంలో యావే ప్రభువు అబ్రాహాము, ఈసాకు, యాకోబు, మోషే మొదలయినవాళ్ళతో నిబంధనం చేసికొన్నాడు. ఈ నిబంధనం ద్వారా అతడు యిస్రాయేలీయుల దేవుడూ, వాళ్ళ అతన్ని పూజించే ప్రజలూ అయ్యారు. ఆ జనులు అతనితో దగ్గరసంబంధం పెట్టుకొని జీవించారు. ఈలా నిబంధనం ద్వారా ఆ భగవంతునికీ ప్రజలకీ యేర్పడిన సంబంధాన్ని సూచిస్తూ పూర్వవేదం ఐదు పెద్ద ఉపమానాలు వాడింది. అవి యివి. భగవంతుడు గొర్రెల కాపరి, ఆ ప్రజలు అతడు మేపే గొర్రెలు, అతడు తోటకాపు, వాళ్ళ అతడు నాటిన ద్రాక్షతోట. అతడు గృహ నిర్మాత, వాళ్ళు అతడు కట్టినయిల్ల, అతడు వరుడు లేక పెండ్లికుమారుడు, వాళ్ళు అతడు పెండాడిన వధువు. అతడు తండ్రి, వాళ్ళు అతడు కన్నసంతానం. వీటిల్లో ఇప్పడు మనం చదవబోయేది పెండ్లికుమారుడు - వధువు అనే అంశం.
ఈ యంశంలో మళా మూడు భాగాలున్నాయి. ఎడారి కాలంలో యిప్రాయేలీయులు ప్రభువుపట్ల భక్తిభావంతో జీవించారు. కనుక ఆ కాలంలో వాళ్ళు అనురాగంగల వధువులాంటివాళ్ళు కనాను మండలంలో స్థిరపడిన పిమ్మట వాళ్ళు చంచలబుద్ధితో బాలు ఆరాధనకు పూనుకొన్నారు. కనుక ఈ కాలంలో వాళ్ళ వ్యభిచారానికి పాల్పడిన పాపపు వధువులాంటివాళ్ళు బాబిలోను ప్రవాసంలో కష్టాలు అనుభవించిన పిదప ప్రభువు వాళ్ళ పాపాలను మన్నించాడు. వాళ్ళను బాబిలోనియానుండి మళ్ళా కనాను దేశానికి తోడ్కొని వచ్చాడు. ఇది రెండవ నిర్గమనం లాంటిది. మొదటి నిర్గమనం