అని పేత్రు బోధించాడు - అ.చ.236. ఈ వాదోపవాదాల సందర్భంలో "క్రీస్తు" అనే పేరు బాగా ప్రచారం లోకి వచ్చింది, అది యేసు సొంత నామమైపోయింది. అతనికున్న ఇతర నామాలను కూడ తనలో కలుపుకొని తానొక్కటే అతని ముఖ్య నామమైపోయింది. అటుపిమ్మట క్రీస్తు అంటే నజరేతూరి యేసు అనే అర్థం వచ్చింది. అంతకుముందు ఆ శబ్దానికి ఆ యర్ధముండేది కాదు. క్రీస్తు అంటే రాజు, యాజకుడు ఎవరైనా కావచ్చు పైగా క్రీస్తుని అనుసరించేవాళ్ళనీ అతని శిష్యులనూ "క్రైస్తవులు" అని పిలవడం మొదలెట్టారు. ఈ పలుకుబడి మొదట అంతియోకయలో ప్రారంభమైంది. తర్వాత లోకమంతటా వ్యాపించింది - అచ 11:26.
ప్రార్థనాభావాలు
1. క్రీస్తంటే అభిషేకం పొందినవాడని చెప్పాంగదా! కాని అతడు ఎప్పుడు అభిషేకం పొందాడు? యోర్దానులో జ్ఞానస్నానం పొందినపుడు ఆత్మ పావురం రూపంలో తన మిూదికి దిగిరావడం ద్వారా ఈ యభిషేకం జరిగింది. ఈ యాత్మాభిషేకం అతడు ప్రవక్తగా బోధ చేయడానికి - లూకా 3,21-22. ఈలా అభిషిక్తుడైన క్రీస్తు నేడు మనలను కూడ బోధనా కార్యక్రమానికి ఆహ్వానిస్తూంటాడు.
2. క్రీస్తులాగే మనం కూడ అభిషేకం పొందుతాం. “ఆయన వలన విూరు పొందిన అభిషేకం విూయందు నిల్చివుంది. కనుక ఎవడును విూకు బోధింప నక్కరలేదు" - 1యోహా 2,27, ఇక్కడ అభిషేకం అంటే క్రీస్తుని గూర్చిన బోధను విని అతన్ని విశ్వసించడం. ఈ క్రియ ఆత్మద్వారా జరుగుతుంది. కనుక ఆత్మ మనం క్రీస్తుని నమ్మేలాగ చేయడమే ఇక్కడ అభిషేకం. ఈ యభిషేకాన్ని అధికాధికంగా దయచేయమని ఆ యాత్మనే అడుగుకొందాం.
3. క్రీస్తుని అనుసరించేవాడు క్రైస్తవుడు, కనుక మన ప్రవర్తనం యోగ్యంగా వుండాలి. మనం గురువుకు తగిన శిష్యులంగా జీవించాలి. అనగా క్రీస్తుపట్ల భక్తి విశ్వాసాలతో జీవించాలి. "నాంకేవాస్తే? క్రైస్తవులంగా వండిపోగూడదు.
12. యేసు
1. యేసు నామం అర్థం
ప్రభువు బిరుదం క్రీస్తు, ఐతే సొంతపేరు యేసు, ఈ యేసు అనేది "ఇయేసుస్” అనే గ్రీకు నామం నుండి వచ్చింది. హీబ్రూ భాషలో అతని పేరు "యెహోషువా," దీని సంగ్రహరూపం యోషువా, ఈ పేరుకి యావే ప్రభువు దయచేసే రక్షణం అని అర్థం.