పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాని యూదుల్లో అతన్ని గూర్చి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. యూదుల అధికారులు అతన్ని మెస్సీయాగా అంగీకరించలేదు, అలా అంగీకరించిన వారిని ప్రార్థనా సమాజం నుండి వెలివేస్తామని గూడ బెదిరించారు - యోహా 9,22. ఐనా శిష్యులు మరికొందరు సామాన్య ప్రజలు మాత్రం అతన్ని మెస్సీయాగా గుర్తించారు - మార్కు 8,29.

యేసునాడు మెస్సీయా పదం రాజకీయ భావాలతోను, తిరుగుబాటు భావాలతోను నిండివుండేదని చెప్పాం. మెస్సీయా రోమను ప్రభుత్వంతో యుద్ధం చేస్తాడని యూదులు నమ్ముతూ వచ్చారని చెప్పాం. ఈ కారణాల వల్ల యేసు ఈ పదాన్ని తనకు వాడుకోలేదు. యోహాను 4, 25 -26 లో మాత్రం ఈ పదాన్ని తనకు వాడుకొన్నట్లు కన్పిస్తుంది, ఇక్కడ సమరయ స్త్రీ క్రీస్తు అనబడే మెస్సీయా రానున్నాడు, అతడు వచ్చినపుడు అన్ని విషయాలు తెలియజేస్తాడు అంటుంది. ఆ క్రీస్తుని నేనే అంటాడు ప్రభువు.

ఈవొక్క సందర్భంలోనే దప్పితే ఇతర తావుల్లో యేసు తనకీ పేరు వాడుకోలేదు. ఇతరులను గూడ తనకీ పేరు వాడవద్దని శాసించాడు. దయ్యాలు తన్ను క్రీస్తునిగా తెలియజేయరాదని ఆజ్ఞాపించాడు - లూకా 4,41. శిష్యులను గూడ తన్ను క్రీస్తునిగా తెలియజేయవద్దని ఆదేశించాడు - మత్త 16,20.

ఆ ప్రభువు స్వయంగా కోరుకొంది యాజకుడైన మెస్సీయా బిరుదం. యాజక మెస్సీయాగా తన ప్రాణాలు అర్పించడం అతని కిష్టం - మార్కు 8,31.

ప్రధాన యాజకుడు అతన్ని నీవు దేవుని కుమారుడవైన మెస్సీయావా అని అడిగాడు. క్రీస్తు"నీవన్నట్టే ఇక మిూదట మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిప్రక్కన కూర్చుండి వుండటం విూరు చూస్తారు" అని జవాబు చెప్పాడు. ఈ వాక్యం దానియేలు గ్రంథం 7, 11 నుండి గ్రహింపబడింది, ఈ దానియేలు గ్రంథం పేర్కొనే మనుష్యకుమారుడు మెస్పీయాయే. ఈలా తాను మెస్పీయానని చెప్పకొన్నందుకే యాజకులు యేసుకి మరణశిక్ష విధించారు - మత్త 26,63-65.

కాని ఉత్దానానంతరం ప్రభువు ఈ క్రీస్తు అనే బిరుదాన్ని మల్లా తనకు వాడుకొన్నాడు. ఎందుకంటే అప్పడిక ఆ పదం వల్ల రాజకీయభావాలు ధ్వనింపవు - లూకా 2426.

4. తొలినాటి తిరుసభలో

యేసు ఉత్దానమై పవిత్రాత్మ దిగిరాగానే శిష్యులు యేసే పూర్వవేదం వాకొన్న క్రీస్తు అని బోధించడం మొదలెట్టారు. కాని యీ బోధ యేసుని సిలువ వేసిన యూదులకు గిట్టలేదు. కనుక శిష్యులకూ యూదనాయకులకూ మధ్య వాదోపవాదాలు జరుగుతుండేవి. "మిూరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు"