పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. మనకు రక్షణం లభించే సమయం దగ్గరలోనే వుంది - రోమా 12,11. అది ప్రస్తుతకాలమే. ఈ వర్తమాన కాలంలో భక్తితో జీవించేవాళ్ళకు మోక్షం దానంతట అదే లభిస్తుంది. మనం ఈలోక జీవితంతో పరలోక జీవితాన్ని కొనుక్కోవాలి. కనుక ఇక్కడ, యిప్పడు, భక్తితో జీవిద్దాం.

3. క్రీస్తు మరడోత్తానాలతో ఐక్యం కావడంలోనే మన రక్షణం ఇమిడివుంది. ఈ కార్యం జ్ఞానస్నానంతో ప్రారంభమౌతుంది. రోజురోజు పూజబలిలో కొనసాగుతుంది. కనుక తరచుగా పూజబలిలో పాల్గొనేవాళ్ళ రక్షణాన్ని మరింత ధ్రువంగా పొందుతారు.

4. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి దాన్ని రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ క్రీస్తుని విశ్వసించి అతని ఆజ్ఞల ప్రకారం జీవించేవాళ్ళకు రక్షణమే గాని ఖండనం లేదు - యోహా 8,16–17. కనుక ఆ ప్రభుని నమ్మదాం.

11. మెస్సీయా

మెస్సీయా అనే మాట "మషీహా" అనే హీబ్రూ పదం నుండి వస్తుంది, దీనికి తుల్యమైన గ్రీకుమాట క్రీస్టోస్. ఈ మాటలన్నిటికి అభిషిక్తుడు - అనగా అభిషేకం పొందిన వాడు అని భావం. పూర్వవేదంలో రాజులు, ప్రవక్తలు, యాజకులు అభిషేకం పొందారు. ఈ మూడు రకాల అభిషేకాలను పరిశీలిద్దాం.

1. మూడు రకాల అభిషేకాలు

1. రాజులు

సమూవేలే సౌలుని తొలి రాజునిగా అభిషేకించాడు - 1సమూ 10,1. అతడు దేవునిమాట వినకపోతే తర్వాత దావీదుని రెండవ రాజునిగా అభిషేకించాడు - 1సమూ 16,13, గీహోను చెలమవద్ద సాదోకు సొలోమోనును రాజుగా అభిషేకించాడు - 1రాజు 139. దేవునినుండి అభిషేకం పొందినవాడు పవిత్రవ్యక్తి. దేవుడు అతని ద్వారా తన ప్రణాళికలను నిర్వహిస్తాడు. అతడు దేవునిన ప్రతినిధి. కాని దేవుడు కాదు.

2. యాజకులు

ప్రధాన యాజకునికి సాధారణ యాజకునికి గూడ అభిషేకం చేసేవాళ్ళ - నిర్ణ 29,9. అలా అభిషేకం పొందినవాళ్ళు పవిత్రులు,