పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రభువు తన బోధలద్వారా, అద్భుతాల ద్వారా జక్కయలాంటి పాపులకు రక్షణం దయచేసాడు - లూకా 19,9. త్రోవ తప్పిన గొర్రెను వెదకి మందలోనికి చేర్చాడు - లూకా 15,6. ఈ వుదాహరణలన్నీ పాపులు రక్షణాన్ని పొందుతారు అనడానికి నిదర్శనంగా వుంటాయి.

క్రీస్తు పాపం నుండి మనలను రక్షించడానికే తన ప్రాణాలను బలిగా అర్పించాడు. అతడు "నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని బలిగా అర్పిస్తాను" అన్నాడు - యోహా 10,15, పెంతెకోస్తు అనంతరం పేత్రు క్రీస్తు నుద్దేశించి మాట్లాడుతూ "ఈ నామం వలననే మనకు రక్షణం కలగాలి గాని మరి యే నామం వలనా రక్షణం కలుగదు" అని బోధించాడు - అచ 4, 12.

4. క్రైస్తవుడు రక్షణం పొందే తీరు

క్రైస్తవుడు క్రీస్తుని నమ్మడం ద్వారా రక్షణం పొందుతాడు. కనుకనే పౌలు ఫిలిప్పి చెరసాల అధిపతితో "ప్రభువైన యేసునందు విశ్వాసముంచితే నీవూ నీ కుటుంబమూ రక్షణం పొందుతారు" అని చెప్పాడు - అచ 16,31. ఇంకా జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవుడు రక్షణం పొందుతాడు - 1పేత్రు 3,21. రక్షణమనేది కేవలం దేవుని దయ. దానిమిూద మనకు ఏ హక్కూలేదు - ఎఫె 2,5, ఐనా మనం దేవుని దయతో సహకరించాలి. భయంతో గడగగ వణకుతూ మన రక్షణ కార్యాన్ని కొనసాగించుకోవాలి - ఫిలి 2,12. సత్ర్కియలు చేసి పాపాన్ని విసర్జించాలి. మనం రక్షణం పొందడానికి అనుకూలమైన సమయం ఇదే. ఇదే రక్షణ దినం - 2కొరి 6,2. అనగా మనం క్రీస్తుని నమ్మి ఇప్పడే, ఇక్కడే రక్షణం పొందాలని భావం.

5. పూర్తి రక్షణం పరలోకంలోనే

క్రీస్తుద్వారా మనకు రక్షణం లభిస్తుంది. కాని ఈ లోకంలో వుండగా మనకు పూర్తి రక్షణం లేదు. ఇక్కడ మనది పాపంతో గూడిన అపరిపూర్ణ జీవితం. పరలోకంలో గాని మనకు పరిపూర్ణ రక్షణం లభించదు. దాని కొరకే మనం ఎదురుచూస్తూంటాం - రోమా 823 ఉత్తానక్రీస్తు పరలోకం నుండి దిగివచ్చి మన మర్త్య శరీరాలను దివ్యమైన వాటినిగా చేసేవరకూ - అనగా మన వుత్థానం వరకూ - మనం అపరిపూరులంగానే వండిపోతాం - ఫిలి 3,20-21.

ప్రార్ధనా భావాలు

1. ఈ లోకంలో మనకు పూర్తి రక్షణం లేదు, పరలోకంలోనే గాని అది పూర్తిగా లభించదని చెప్పాం. ఆ రక్షణర కొరకు మనం వేచివుండాలి. క్రీస్తు రెండవసారి వేంచేసి తన కొరకు భక్తితో వేచివుండే వాళ్ళను సంపూర్ణంగా రక్షిస్తాడు - హెబ్రే 9,28.