పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూత్న వేదంలో మొదటి పేత్రు జాబు ఈ ప్రవచనాన్ని క్రీస్తుకి అన్వయిస్తుంది - 2,6. విశ్వాసులు క్రీస్తుని నమ్మాలని చెప్తుంది. ఆ క్రీస్తు బోధనలను నమ్మేవాడు రాతి పునాది మిూద యిల్లు కట్టుకొన్న వానితో సమానం - మత్త 7,24. క్రీస్తులాగే అతని ప్రధాన శిష్యుడైన పేత్రు కూడ శిలే, అరమాయిక్ భాషలో అతని పేరు కేఫా, రాయి అనే ఈ మాటకు అర్థం. కనుకనే క్రీస్తు పేత్రుతో "పేత్రూ! నీ పేరు రాయి. ఈ రాతి విూద నా సమాజాన్ని నిర్మిస్తాను. నరకశక్తులు దాన్ని జయించలేవు" అని అన్నాడు - మత్త 16,18, కాని నూత్న వేదంలో రాయి అనే పేరు తరచుగా మెస్సీయాకే వర్తిస్తుంది.

4 రాతినుండి నీళ్ళ

రాయి కఠినమైంది. ఎండిపోయి వుండేది. కాని దేవుని హస్తాలు సోకినపుడు అది మెత్తబడుతుంది. దాని నుండి నీళ్లు స్రవిస్తాయి కూడ. మోషే యిస్రాయేలీయులను గూర్చి చెప్తు

"పర్వతాల పంట వారికి భోజనమైంది కొండ చరియల్లోని తేనె వారికి ఆహారమైంది రాతినేలలో వారి ఓలివు చెట్లు పెరిగాయి" అంటాడు - ద్వితీ 82,13. అనగా దేవుని అనుగ్రహం వలన రాళ్ళు గూడ ప్రజలకు ఉపయోగపడ్డాయని భావం, ఇంకా మెరీబాచెంత మోషే కొండబండను బెత్తంతో కొట్టగా దానినుండి నీళ్లు వెలువడ్డాయి - నిర్గ 17,6. రాతి బండనుండి నీళ్లు పట్టడం ఆశ్చర్యం కదా! అది దేవుని కరుణ. పూర్వవేద రబ్బయిలు ఈ రాయి ఎడారిలో యిస్రాయేలీయులతో పయనించిందన్నారు. కాని నూత్న వేదంలో పౌలు ఆ బండ క్రీస్తేనని చెప్పాడు, ఆ బండ నుండి కారే నీళ్ళతో మనం దాహం తీర్చుకోవాలి - 1కొరి 10,4, క్రీస్తు నుండి జీవజల నదులు పడతాయి, అవి తన్ను విశ్వసించేవారి అంతరంగంలోనికి పారతాయి - యోహా 7,37-39. ఇంకా సిలువ మిూద తెరువబడిన క్రీస్తు హృదయం అనే బండనుండి కూడ నీళూ నెత్తురూ ఊరతాయి - యోహా 19,34. ఈ నీళ్లు నేటి జ్ఞానస్నానానికీ, ఈ రక్తం నేటి దివ్య సత్ర్పసాదానికి చిహ్నంగా ఉంటాయి. యిలా రాయి తానిచ్చే నీటిద్వారా జీవనసాధన మౌతుంది.

5. నాశం చేసే రాయి

బైబుల్లో రాయి జీవాన్నిచ్చేది మాత్రమే కాదు, నాశం చేసేది కూడ, యెషయా ప్రవచనంలో ప్రభువు