పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దేవునిగాకంటె నరుజ్జీగా భావించారు. క్రీస్తు ఉత్తానోత్సవానికంటె అతని జననోత్సవానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. మన మట్టుకు మనం క్రీస్తు మనుష్యావతారంలో అతని దివ్యత్వమూ మహిమా రెండూ గుర్తించాలి,

4. క్రీస్తు నరావతారాన్ని తలంచుకొనేపుడు ఆ ప్రభువుకి మానుషజన్మనిచ్చిన మరియమాతనుగూడ స్మరించుకోవాలి. తొలిశతాబ్దాలనుండి క్రైస్తవ భక్తులు ఆమెను దేవుని తల్లినిగా వినుతిస్తూవచ్చారు. మరియ అనే తీగ క్రీస్తు అనే పూవు పూచింది. రక్షకుడనే పండు కాచింది. నేడు మనం ఆ పూవు సువాసనని అనుభవిస్తున్నాం. ఆ పండుని భుజిస్తున్నాం. మరియు మహోపకారానికి ఆ తల్లిని నోరారస్తుతించాలి. మనలను తన కుమారుని చెంతకు చేర్చమని అడుగుకోవాలి.

2. క్రీస్తు జ్ఞానస్నానం

క్రీస్తు జ్ఞానస్నానం అతని సిలువ మరణాన్ని సూచిస్తుంది. అతడు ప్రవక్త అనీ, బాధామయ సేవకుడనీ, నూత్నవేద ప్రజలకు నాయకుడనీ తెలియజేస్తుంది. ప్రత్యక్షంగా కాదుగాని పరోక్షంగా అతని జ్ఞానస్నానం మనజ్ఞానస్నానంమీద కూడ పనిజేస్తుంది. ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం.

1. జ్ఞానస్నాన సంఘటనం

క్రీస్తు జ్ఞానస్నానం మత్తయి 3, 13 - 17లో వర్ణింపబడింది. ఇక్కడ మనం రెండంశాలను పరిశీలిద్దాం. మొదటిది, యోహాను జ్ఞానస్నానం. ఆనాటి యూదులు యోహాను నుండి యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందారు. క్రీస్తు కూడ యోహానునుండే జ్ఞానస్నానం స్వీకరించాడు. ఇది నూత్నవేద జ్ఞానస్నానంలాగ ఓ సంస్కారం కాదు. కేవలం శుద్దీకరణకర్మ మాత్రమే. ఇది నాటి ప్రజలను మెస్సీయా రాకడకూ అతడు నెలకొల్పబోయే దైవరాజ్యానికీ సిద్ధం చేసింది. పశ్చాత్తాప మార్గాన ప్రజలు దైవరాజ్యంలో చేరాలని బోధించింది - మార్కు 1,4. ఈ పశ్చాత్తాపం ద్వారానే ఈ జ్ఞానస్నానం భక్తులకు వరప్రసాదాన్ని ఆర్థించి పెట్టగలిగింది. తరువాత నూతవేద ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా పొందబోయే జ్ఞానస్నానానికి ఈ యోహాను జ్ఞానస్నానం సంకేతంగా వుంటుంది.

రెండవది, క్రీస్తు ఎందుకు జ్ఞానస్నానం పొందాడు? పూర్వవేదంలో పిత మెస్సీయాద్వారా ప్రజలను రక్షిస్తానని వాగ్దానం చేసాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే క్రీస్తు వచ్చాడు. అనగా అతడు తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళికను సాధించేవాడు. ఆ