పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/199

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

- ఆది 3,15. మెస్సీయా వచ్చి పిశాచాన్ని జయించి మానవులకు పాపవిముక్తి కలిగిస్తాడని ఈ ప్రవచనం భావం. ఇంకా యెషయా ప్రవచనం "ప్రభువైన యావే మృత్యువును సదా నాశం చేసి ఎల్లరి కన్నీళ్ళను తుడిచివేస్తాడు" అంటుంది - 25,8.

"నేను ఆ రాత్రి చూచిన దృశ్యంలో
నరపత్రుని వంటివాడు
మేఘావృతుడై రావడం చూచాను
అతడు పరిపాలనను కీర్తిని
రాజ్యాధికారాన్ని పొందాడు"

అంటుంది దానియేలు ప్రవచనం - 7,13-14 ఈ నరపత్రుడు మెస్సీయా, ఈలాంటి వేదవాక్యాలన్నిటి భావమేమిటంటే, తొలి ఆదాములో నరజాతి అంతా ఇమిడివుంది. కనుక అతని పాపం నరజాతికంతటికీ సంక్రమించింది. ఈ పాపం నుండి మనలను రక్షించడానికై ఒక నరపత్రుడు, మెస్సియా, వేంచేస్తాడు. మనమందరం అతనిలో ఇమిడి వుంటాం. అతడు నూత్న మానవజాతికి శిరస్సు. కనుకనే అతని పరిహారం మనకందరికీ మేలు చేస్తుంది. అతడే రెండవ ఆదామైన క్రీస్తు, ఇక ఈ క్రీస్తుని గూర్చి విచారిద్దాం.

2. రెండవ ఆదాము

దానియేలు గ్రంథం క్రీస్తుని "నరపత్రుడు" అని పిలుస్తుంది. ఈ మాటనే తర్వాత సువిశేషాలు మనుష్యకుమారుడు అని పేర్కొన్నాయి, ఇక్కడ నరపత్రుడు అంటే నరజాతికి చెందినవాడని అర్థం. అతడు దేవుడై కూడ నరుడై జన్మించి వారిపట్ల సానుభూతి చూపాడు, వారి పాపానికి పరిహారం చేసాడు. నూతవేదం చాల తావుల్లో ప్రాత ఆదాముకీ నూత్న ఆదామైన క్రీస్తుకీ పోలికలు చూపుతుంది. ప్రస్తుతానికి ఈ పోలికల్లో రెండిటిని మాత్రం పరిశీలిద్దాం. మొదటిది - 1కొరి 15,45-49 వచనాలు. ఇక్కడ పౌలు మన ఉత్దానాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. "మొదటి మానవుడైన ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కాని చివరి ఆదాము జీవన ప్రదాతయగు ఆత్మ మొదట వచ్చునది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము, మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను. రెండవ ఆదాము దివినుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువినుండి చేయబడిన వానిని పోలియందురు, దివికి సంబంధించిన వారు దివినుండి వచ్చినవానిని పోలియుందురు, భువినుండి పుట్టినవానిని పోలియుండిన మనము దివినుండి పట్టినవానిని పోలగలము."

ఈ వాక్యాల్లో పౌలు ఇద్దరు ఆదాములను ఒకరితో ఒకరిని పోల్చి వారిలోని వ్యత్యాసాలను చూపించాడు, ఈ వ్యత్యాసాలను విపులంగా పరిశీలిద్దాం.