పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయినపడే ఈ తెరగూడ చినిగి రెండు ముక్కలైంది. నేడు నూత్నవేద ప్రజలమైన మనం నిలువవలసింది క్రీస్తు సాన్నిధ్యంలో, కాని ఈ క్రీస్తు సాన్నిధ్యాన్ని చేరాలన్నా ఓ తెర అడుగా వుంటుంది. అదే క్రీస్తు మానుష దేహం. దేవాలయపు తెరలాగే సిలువపై కెక్కిన క్రీస్తు దేహం కూడ చినిగి ఛేదమైపోయింది. ఉత్తానానంతరం క్రీస్తు మానుష దేహం పరిశుద్దాత్మతో నిండి ఆధ్యాత్మిక దేహంగా మారిపోయింది. నేడు మనం ఆరాధించేది పాలస్తీనా దేశపు మానుష క్రీస్తుని గాదు, ఆధ్యాత్మిక స్వరూపుడైన ఉత్థాన క్రీస్తుని. ఇప్పడు మనం ఏ తెరా అడ్డులేకుండ ఉత్తాన క్రీస్తు సన్నిధిలోనికి వెత్తాం. పూర్వవేదపు జనులు యావే సన్నిధిలో నిల్పినట్లే మనమూ క్రీస్తు సన్నిధిలో నిలుస్తాం.

ఈలా క్రీస్తు మనకు సజీవమూ నూత్నమూ ఐన మార్గం. కనుకనే అతడు తోమాతో "నేనే మార్గాన్ని అని చెప్పాడు - యోహా 14,6. పూర్వవేదంలో మోషే, అతడు స్వీకరించిన ధర్మశాస్త్రమూ యూదులకు మార్గమయ్యాయి. ధర్మశాస్రాన్ని పాటించడం ద్వారా యూదులు రక్షణం పొందారు. కాని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం మనలనిక రక్షించలేదు. కనుక యూదులకువలె అది మనకు మార్గం కాలేదు. పితను చేరాలంటే ప్రస్తుతం మార్గం క్రీస్తు మాత్రమే. అతన్ననుసరిస్తేనే గాని మనం మోక్షాన్ని చేరలేం.

ఈ క్రీస్తు మరణానంతరం తండ్రిని చేరుకొన్నాడు. స్వర్గంలో మనకోసం ఓ తావును సిద్ధంచేసాడు. మళ్ళా మన చెంతకు తిరిగివచ్చి మనలను గూడ ఆ తావుకి తీసుకవెళ్లాడు. ఆ తావు మరేమోకాదు పితృసాన్నిధ్యం, మోక్షం - యోహా 14,23

ప్రార్ధనా భావాలు

1. ఈ జీవితంలో మనం సులభంగా త్రోవదప్పతాం. పాపమార్గాల్లో పయనిస్తాం. కాని ప్రభువుకి మన మార్గాలన్నీ తెలుసు. "ప్రభువు కన్నులు మన పోకడలన్నీ గమనిస్తాయి, అతడు మన మార్గాలన్నీ గుర్తిస్తుంటాడు" - యోబు 3421. అతనికి మన త్రోవలన్నీ బాగా తెలుసు - కీర్త 139,3, ఐనా అతడు మనలను శిక్షించడానికంటె రక్షించడానికే సిద్ధంగా వుంటాడు.

"ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు
అతడు పాపులకు తన త్రోవలను తెలియజేస్తాడు
వినయవంతుల్ని సన్మార్గంలో నడిపిస్తాడు
దీనాత్మలకు తన మార్గాన్ని బోధిస్తాడు"