పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/195

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రారంభిస్తూ "ప్రభు మార్గాన్ని సిద్ధం చేయండి" అని బోధించాడు - లూకా 3,4, యెష 40,3. ఈ ప్రభువు మోస్సీయాయే. యోహాను ప్రభువు రాకడకు ప్రజలను సిద్ధం జేసాడు. పాపాలకు పశ్చాత్తాపపడే విధానాన్ని వారికి నేర్చాడు. ఓమారు అతడు యోర్గాను నదిలో ప్రజలచే తపోస్నానం చేయిస్తుండగా ప్రభువైన క్రీస్తు దిథీలున రానే వచ్చాడు.

పూర్వం మోషే ప్రజలకు నాయకుడయ్యాడు. అతడూ అతడు స్వీకరించిన ధర్మశాస్త్రమూ ప్రజలను నడిపించాయి. కాని యిపుడు క్రీస్తు ప్రజలకు నూత్న మోషేగా విచ్చేసాడు. అతడు నూత్నవేద ప్రజలకు నాయకుడు - హెబ్రే 12,2. కనుక అతడు శిష్యులను పిలవగానే వాళ్ళ అతన్ని వెంబడించారు. పేత్రు అందైయాలను ఆహ్వానింపగానే వాళ్ళ అతని వెంటబడిపోయారు - మత్త4,18-20. ప్రజలు గూడ గుంపులు గుంపులుగా క్రీస్తు ననుసరించడం ప్రారంభించారు. అతడు తన తండ్రి మార్గాలనూ తన మార్గాలనూ గూడ వారికి బోధించాడు.

క్రీస్తు మార్గం ఈ లోకమనుసరించే సుఖ మార్గం కాదు, సిలువ మార్గం. అతడు మొదటగ శ్రమలనుభవించి అటుపిమ్మట మహిమలో ప్రవేశించాలి- లూకా 24,26. కావున అతడు ఏకాగ్రదృష్టితో యెరూషలేం వైపు నడచిపోయాడు- లూకా 9,51, ఆ నగరంలో సిలువపై అసువులు బాసాడు. నేడు అతని అనుయాయులైన క్రైస్తవులు కూడ ఈ సిలువ మార్గాన్ని అనుసరించవలసిందే.

"క్రీస్తు తన శరీరం అనే తెర ద్వారా సజీవమైన ఓ క్రొత్త మార్గాన్ని మన కొరకు తెరచాడు" అంటుంది హెబ్రేయుల లేఖ — 10,19, ఈ వాక్యంలో చాల భావాలున్నాయి. పూర్వవేద మార్గం ప్రాతమార్గం. నిర్జీవమార్గం. పూర్వవేద దేవాలయంలో యావే ప్రభువును ఆరాధించేవాళ్లు. నేడు క్రీస్తు వచ్చాక ఆ యారాధనం పోయింది. ఇప్పడు క్రీస్తుద్వారా గాని తండ్రిని కొలవలేం. కనుక ఇది "నూత్నమార్గం", ఇంకా, యెరూషలేం దేవళంలో యావే ప్రభువును ఆరాధించడం మృతమార్గం, నేడు క్రీస్తుద్వారా ఆ తండ్రిని అర్పించడం "సజీవమార్గం".

పైగా, క్రీస్తు దేహమనే తెరగుండా ఈ సజీవమార్గం ఏర్పడింది అన్నాడు మన రచయిత, యెరూషలేం దేవాలయంలోని గర్భాగారంలో దైవసాన్నిధ్యం నెలకొనివుండేది, ఈ గర్భాలయానికి ముందు ఓ తెర వుండేది. ఈ తెరగుండా ప్రధాన యాజకుడు గర్భగృహంలో ప్రవేశించేవాడు. దైవ సాన్నిధ్యంలో నిలచి ధూపం వేసేవాడు. కాని క్రీస్తు మరణంతో ఈ పూర్వవేద ఆరాధనమంతా అడుగంటిపోయింది. యేసు సిలువపై