పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"సాధుపురుషుల మార్గాన్ని ప్రభువు ఆదరిస్తాడు
దుషుల మార్గం నాశానికి గురౌతుంది"

అని చెప్పాడు – 1,6. ఈలాగే సామెతల గ్రంథం కూడ

సత్పురుషుల మార్గం వేకువ వెలుగు వంటిది
పట్టపగలయ్యే వరకూ దాని ప్రకాశం
క్రమంగా ); చెందుతుంది
కాని దుర్మార్డుల మార్గం రాత్రివలె
తమోమయంగా వుంటుంది
ఏది తగిలి పడిపోతారో ఆ పాపులకే తెలియదు"

అని చెప్పంది - 4,18-19.

నరునికి ప్రతినిత్యం రెండు తెన్నులు ఎదురౌతూనే వుంటాయి. అతడు వాటిల్లో జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి. "మేలనీ కీడునీ జీవాన్నీమరణాన్నీనేడు నేను మీముందట వుంచుతున్నాను. భూమ్యాకాశాలను సాక్ష్యంగా బిల్చి చెప్తున్నాను. జీవాన్నీ మరణాన్నీ ఆశీస్సునీ శాపాన్నీ మీ యెదుట నుంచుతున్నాను. మీరు జీవాన్ని ఎన్నుకొనండి. అప్పడు మీరూ మీ సంతానమూ బాగుపడతారు" ద్వితీ 30,15-20

ఈ రెండు తెరువులను గూర్చిన బోధ నూత్నవేదంలో గూడ తగులుతుంది. "మీరు ఇరుకైన ద్వారం గుండ ప్రవేశించండి. జీవానికి పోయే మార్గం ఇరుకైంది. అది కష్టమైంది కూడ. కొద్దిమంది మాత్రమే మార్గాన్నికనుగొంటారు. విశాలమూ సులభమూ ఐన మార్గం మరొకటుంది. అది వినాశానికి చేర్చుతుంది. అనేకులు ఆ మార్గాన పయనిస్తారు" - మత్త 7,13-14 ఇక్కడ పూర్వవేదంలోని మంచి చెడు త్రోవలను మత్తయి ఇరుకైన, విశాలమైన త్రోవలనుగా వర్ణించాడు.

4. క్రీస్తు అనే సజీవమార్గం

క్రీస్తుకి నూరేండ్లకు పూర్వమే కొంతమంది యూదులు మృత సముద్రతీరంలోని కుమ్రాను కొండల్లో ప్రోగై సామూహికంగా సన్యాసజీవితం గడిపారు. వీళ్ళ గ్రంథాల్లో జ్యోతిర్మార్గం, తమోమార్గం అనే రెండు త్రోవల ప్రస్తావనం వుంది. సజ్జనులైన భగవంతుని ప్రజలు అనుసరించే జ్యోతిర్మార్గం. పిశాచ ప్రజలైన దుర్జనులు అనుసరించేది తమోమార్గం. తర్వాత ఈ బోధ నూత్న వేదంలోకి గూడ ప్రవేశించింది.

స్నాపక యోహాను బహుశః ఈ కుమ్రాను సమాజంలో పెరిగివుంటాడు. ఇతడు పూర్వం యెషయా బాబిలోనియా నిర్గమనాన్ని గూర్చి చెప్పిన వాక్యాలతోనే తన బోధ