పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనాత్ములకు తన మార్గాన్ని బోధిస్తాడు
తన నిబంధనను ఆజ్ఞలను పాటించేవారిని
ప్రేమతోను నమ్మదగినతనంతోను నడిపిస్తాడు"
అని చెప్పకొన్నారు - కీర్త25,8–10. ఈ ఐగుప్న ప్రయాణంలో యూదుల నాయకుడు మోషే.

యూదులు ఐగుప్త నిర్గమనాన్నిమరచిపోలేక పోయారు. ఆ వృత్తాంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనేందుకై పాస్కపండుగను గుడారాల పండుగను ఏర్పాటు చేసికొన్నారు, వాటిని కనాను మండలంలో ఏటేట జరుపుకొనేవాళ్లు. తర్వాత షెకెం, షిలో, యెరూషలేం పట్టణాలకు యాత్ర చేసేపుడు గూడ పై ఐగుప్త యాత్రను జ్ఞప్తికి దెచ్చుకొని పరమానందం చెందేవాళ్ళు.

అహాబురాజు యొసెబెలు రాణి పరిపాలించిన కాలంలో దేశంలో బాలు ఆరాధన పెచ్చుపెరిగింది. యేలీయా ప్రవక్త ఈ విగ్రహారాధనాన్ని అరికట్టగోరి కూడ విఫలుడయ్యాడు. అతడు ఓదార్పు కొరకు మళ్ళా హోరెబు కొండకు యాత్ర చేసాడు. పూర్వం మోషే ప్రభువు నుండి ధర్మశాస్రాదన్ని పొందింది ఈ కొండమీదనే. తర్వాత హోషేయ ప్రవక్త ఈ యెడారి ప్రయాణాన్నిజ్ఞప్తికి తెచ్చుకొని ఆ రోజుల్లో ప్రభువు తన బిడ్డడైన యిస్రాయేలుతో ప్రయాణం చేసాడు అని నుడివాడు - 11,1-3. ఈ వేదవాక్యాలను బట్టి యూదులకు ఐగుప్త ప్రయాణం ఎంత ప్రీతిపాత్రమైందో అర్థం చేసికోవచ్చు.

2. ధర్మశాస్త్ర మార్గం

యూదుల ఆలోచనం ప్రకారం ధర్మశాస్త్రం గూడ ఓ ముఖ్యమైన మార్గం. ఈ ధర్మశాస్త్రం ద్వారానే ప్రభువు ఆదేశాలు హీబ్రూ ప్రజలకు విదితమయ్యాయి. కనుకనే ధర్మశాస్త్రం పట్ల తనకున్న గౌరవాన్ని సూచిస్తూ కీర్తనకారుడు.

"నిర్దోషులుగా జీవిస్తూ
ధర్మశాస్తాన్ని అనుసరించేవాళ్ళ ధన్యులు"
అని వాకొన్నాడు, = 119,1. బారూకు గ్రంథం కూడ
"జ్ఞానం భూమిపై ప్రత్యక్షమై నరుల మధ్య వసించింది
ఈ జ్ఞానం దేవుని ఆజ్ఞల గ్రంథం,
శాశ్వతంగా నిల్చే ధర్మశాస్త్రం,
దీన్ని పాటించేవాళ్ళ బ్రతుకుతారు
విడనాడేవాళ్ళు చస్తారు"