పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవభక్తికీ నైతిక జీవితానికీ గూడ సూచనమైంది. బైబుల్లో మార్గం అంటే ప్రవర్తన విధానం, సంప్రదాయం, పథకం, శీలం, దైవాజ్ఞ అనే నానార్ధాలున్నాయి. ఇక్కడ మార్గాన్ని గూర్చిన ప్రధాన భావాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. చారిత్రక మార్గాలు

యూదుల నాయకులు నడచిపోయిన మార్గాలు చారిత్రక స్థాయి నందుకొన్నాయి. ఆ నాయకుల్లో అబ్రాహాము మొదటివాడు. ఇతడు ప్రభువు ఆజ్ఞపై కల్దీయుల నగరమైన ఊరు పట్టణం నుండి బయలుదేరివచ్చి కనాను మండలాన్ని చేరుకొన్నాడు. ప్రభువు ఇతడికి సంతానాన్నీభూమినీ యిస్తానని మాట యిచ్చాడు. ఇతని ద్వారా సమస్త జాతులను దీవిస్తానని వాగ్గానం చేసాడు - ఆది 12,1-5, అబ్రాహాము దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో నడచి అతనికి ప్రీతిపాత్రుడయ్యాడు - 17,1. యూదుల చరిత్రలో ఈజిప్టు నిర్గమనం చాల గొప్ప సంఘటనం. ఈ మహా ప్రయాణంలో ప్రజలు తమ దేవుడైన యావేతో నడచివెళ్ళారు. ప్రభువు వారికి ముందుగా సాగిపోతూ వారికి దారి చూపించేవాడు. అతడు పగటిపూట పొగ స్తంభంలాగాను, రాత్రిపూట నిప్ప స్తంభంలాగాను కన్పించేవాడు- నిర్గ 13,21. సముద్రం గూడ అతనికి అడ్డురాలేకపోయింది. కనుకనే

"నీవు సాగరంగుండ నడచావు
లోతైన సముద్రం గుండ సాగిపోయావు
కాని నీ యడుగుజాడలు మాత్రం కన్పించలేదు"

అంటుంది కీర్తన 17,20, ఈలా ప్రభుని సహాయం పొంది యిప్రాయేలీయులు ఐగుప్త దాస్యం నుండి తప్పించుకొని వచ్చారు. నలభై యేండ్లకాలం ఎడారిలో ప్రయాణం చేసారు. ఈ కాలంలో ప్రభువు యిప్రాయేలీయుల పక్షాన పోరాడాడు. వారికి అన్న పానీయాలు దయచేసాడు. ఈ యన్నం మన్నా ఈ పానీయం మెరీబావద్ద లభించిన జలం.తండ్రి కుమారుని వలె తాను వారిని ఆదుకొంటూ వచ్చాడు - ద్వితీ 1,30-33. అటుపిమ్మట సీనాయి కొండదగ్గర ఆ ప్రజలతో నిబంధనం చేసికొన్నాడు. ఆ వొడంబడిక ప్రకారం వారిని వాగ్దత్తభూమికి తీసికొనివచ్చాడు. అది వారికి విశ్రాంతిని దయచేసే దేశం. దాస్యగృహమైన ఐగుప్తనుండి ప్రభువు వారిని నడిపించుకొని వచ్చిన తీరునూ, తాము చేరుకొనిన దేశాన్నీ చూచి యిస్రాయేలీయులు మురిసిపోయి

"ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు
అతడు పాపులకు తన త్రోవలను తెలియజేస్తాడు
వినయవంతులను సన్మార్గాన నడిపిస్తాడు