పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని అర్థం. పూర్వవేదంలో యావే ప్రభువు నిరంతరమూ దేవళంలో యిస్రాయేలీయులమధ్య నెలకొని వుండి వాళ్ళను కాపాడేవాడు. అలాగే నూత్నవేదంలో క్రీస్తకూడ మనమధ్య, మనతో ఉంటాడు. మనలను కాపాడుతూంటాడు. నూత్నవేదంలో ఉత్థాన క్రీస్తే మన దేవాలయమౌతాడు-యోహా 2,21-22. పై యోహాను 1,14లో “మనమధ్య వసించాడు" అన్నదానికి గ్రీకు మూలంలో "మనమధ్య గుడారం పన్నుకొన్నాడు" అని ఉంది. యూదులు గుడారాల్లో వసించేవాళ్ళు. క్రీస్తు మనుష్యావతారంకూడ అతడు ఈ భూమిమీద, తన ప్రజల మధ్య గుడారం పన్నుకోవడం లాంటిది.

ఇక రెండవ భావమైన “మహిమ" అనేదాన్ని చూద్దాం. మానవావతారమెత్తిన క్రీస్తు మహిమ అతని తండ్రి మహిమలాంటిది. ఇక్కడ మహిమ అంటే తేజస్సు పూర్వవేదంలో తండ్రి తేజస్సుకి "షెకీనా" అని పేరు. యెరూషలేము దేవళంలో మందసంమీద ఆ తేజస్సు ప్రకాశిస్తుండేది - 1 రాజు 8,10-11. నూతవేదంలో క్రీస్తు తండ్రికి ప్రతిరూపం. (కనుక తండ్రి తేజస్సు అతనికీ సంక్రమిస్తుంది). ఈ తేజస్సుని క్రీస్తు తర్వాత తన అద్భుతాల ద్వారా ప్రదర్శిస్తాడు. ఉత్తానం ద్వారా అతనికి పరిపూర్ణ తేజస్సు సిద్ధిస్తుంది.

 ప్రభువు నిరంతరమూ మనమధ్య వసిస్తూ మనలను ఆదరిస్తుంటాడు. అతడు తేజోమూర్తి కూడ. ఆలాంటి ప్రభువుకి నమస్కారం చెబుదాం.

3.యోహాను మనుష్యావతారంలో క్రీస్తు తేజస్సుని దర్శించాడు - 1, 14. కాని పౌలు మనుష్యావతారంలో క్రీస్తు దైన్యాన్ని చూచాడు - ఫిలి 2,7. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన భావాలు కావు. ఒకదాన్నొకటి పరిపూర్ణం చేసికొనే భావాలు. ప్రభువు నరావతారంలో తేజస్సూ దైన్యమూ రెండూ వున్నాయి. మనకు గ్రీకు తిరుసభ, ల్యాటిను తిరుసభ అని రెండున్నాయి. మనం ల్యాటిను తిరుసభకు చెందిన క్రిస్తవులం. గ్రీకు తిరుసభకు చెందిన క్రైస్తవులు యోహాను భావాలు స్వీకరించారు. వాళ్ళు మనుష్యావతారంలో క్రీస్తు మహిమకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. అతన్ని నరునిగాకంటె దేవుణ్ణిగా భావించారు. క్రీస్తు జననోత్సవానికంటె అతని ఉత్తానోత్సవానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. ల్యాటిను తిరుసభకు చెందిన క్రైస్తవులు పౌలు భావాలు స్వీకరించారు. వాళ్ళు మనుష్యావతారంలో క్రీస్తు దీనత్వానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. అతన్ని