పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని చెప్పంది కీర్తన 37,25, అనగా ప్రభువు సజ్జనుడికి కడుపునిండా కూడు పెడతాడని భావం, రాజులు రెండవ గ్రంథంలో ఎలీషా రొట్టెలను పంచిపెట్టిన ఉదంతం వస్తుంది. ఒకడు ప్రవక్తకు ఇరువది రొట్టెలూ, ధాన్యపు వెన్నులూ బహూకరించాడు. ఎలీషా వాటిని వందమంది ప్రవక్తలకు పంచిపెట్టాడు. వాళ్ళంతా భుజించిన పిదప కూడ ఇంకా కొన్ని రొట్టెలు మిగిలాయి - 2రాజు 4,42–44 దేవుడు తన భక్తులకు సమృద్ధిగా భోజనం దయచేస్తాడని ఈ కథ భావం. దీనికి భిన్నంగా దేవుడు శిక్షించేవారికి కూడు దొరకదు. కనుకనే యిర్మీయా యెరూషలేము పౌరుల నుద్దేశించి

"ప్రభువు దూర ప్రాంతం నుండి
శత్రుజాతులను మీ మీదికి గొనివస్తాడు
వాళ్ళమీ పంటనూ మీ యన్నాన్నీ తినివేస్తారు
మీ కొమరులను కొమార్తలనూ చంపుతారు"
అని ప్రవచించాడు - 5, 17.

ఆహారం దేవుని దీవెన గనుక నరుడు వినయంతోను నమ్మకంతోను ప్రభువు నుండి దాన్ని అడుక్కోవాలి. "ప్రభూ! మా అనుదినాహారాన్ని మాకు దయచేయి" అని వేడుకోవాలి - మత్త 6,11. ఈలా ప్రార్ధించినవారికి భోజనం పుష్కలంగా లభిస్తుంది. కావననే యిస్రాయేలీయులు ఎడారిలో తిన్నమన్నానుద్దేశించి

"నరులు దేవదూతల భోజనాన్ని సాపడ్డారు
ప్రభువు వారికి సమృద్ధిగా ఆహారాన్ని దయచేసాడు"
అని చెప్తుంది కీర్తన 78,25. అలాగే క్రీస్తు ఐదువేల మందికి ఆహారం పెట్టినపుడు గూడ, వాళ్ళంతా భుజించి సంతృప్తి చెందిన పిమ్మట మిగిలిన రొట్టెముక్కలను పండైండు గంపలకెత్తారు - మత్త 1420. దేవుని దీవెనలకు ఏమి కొదవ?

4 కడపటి దినాల్లో లభించే మహాభాగ్యం

భోజనం కడపటిదినాల్లో దేవుడు నరులకు దయచేసే మహాభాగ్యానికి గుర్తుగా వుంటుంది. ఈ భాగ్యాన్ని మనసులో పెట్టుకొనే యిర్మీయా ప్రవక్త

“యిస్రాయేలీయులు ప్రవాసం నుండి తిరిగివచ్చి
సియోను కొండపై సంతసంతో పాటలు పాడతారు
నా ఔదార్యాన్ని గాంచి సంతసిస్తారు
నేను వారికి ధాన్యమూ ఓలీవుడైలమూ బహూకరిస్తాను
వాళ్ళిక విచారానికి గురికాక
నీరు కట్టిన తోటలా కలకల్లాడతారు"