పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని చెప్తుంది - 29,21. ఇంకా, ఆహారం మనకు పుష్టినిస్తుంది. కనుకనే భక్తుడు భగవంతుణుద్దేశించి

"నీవు నరుని సంతోషపెట్టడానికి ద్రాక్ష సారాయాన్ని అతనికి ఆనందం కలిగించడానికి ఓలివు తైలాన్ని అతన్ని బలాఢ్యుడ్జి జేయడానికి ఆహారాన్ని దయచేస్తావు" అంటాడు - కీర్తన 104,15.

2. మన ఆహారాన్ని ఇతరులతో పంచుకోవాలి

మన భోజనాన్ని మనమే తిని సంతృప్తి చెందకూడదు. దాన్ని ఇతరులతో కూడ పంచుకోవాలి. పరస్పరం కలసి భుజించేవాళ్ళంతా స్నేహితులౌతారు. ఈ భావాన్ని మనసులో పెట్టుకొనే కీర్తనకారుడు

"నేను బాగా నమ్మిన ప్రాణస్నేహితుడే,
నా యింట భోజనం చేసినవాడే,
నా మీద తిరగబడ్డాడు"
అని విచారించాడు - 41,9. అతిథులకు ఆతిథ్యమీయడం పవిత్రకార్యం. అబ్రాహాము మమే వద్ద వసిస్తుండగా దేవదూతలు అతిథుల రూపంలో అతని గుడారం చెంతకు వచ్చారు. అబ్రాహాము వారిని సాదరంగా తోడ్కొనివచ్చి వారికి భోజనం పెట్టాడు. వాళ్ళు నీకు కొడుకు పుడతాడని దీవించారు - ఆది 18, “ఆకలిగొనిన వారికి అన్నం పెట్ట, బట్టలు లేని వారికి బట్టలీయి. నీకు సమృద్ధిగా వున్న ప్రతి వస్తువు నుండి కొంతభాగం దానంగా ఈయి" అంటుంది తోబీతు గ్రంథం 4,16. ఇంకా,
"తన భోజనాన్ని పేదలకు గూడ
వడ్డించే కరుణామయుడు
దేవుని దీవెనలు పొందుతాడు"
అని నుడువుతుంది సామెతల గ్రంథం = 22.9.

3. ఆహారం దేవుని దీవెన

ఆహారం సమృద్ధిగా లభిస్తే అది దేవుని దీవెన అనుకోవాలి. చాలినంత తిండి దొరక్కపోతే అది దేవుని శాపం అనుకోవాలి.

"నేనిపుడు యావనం గతించిన వృద్ధుణ్ణి
కాని ప్రభువు నీతిమంతుణ్ణి పరిత్యజించడంగాని
అతని బిడ్డలు బిచ్చమెత్తుకోవడం గాని
నేనింతవరకు చూడలేదు"