పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నైతేనేమి మన వెలుగు ఇరుగుపొరుగు వాళ్ళమీద ప్రసరించాలి. కనుక మనం ఉత్సాహంతో ప్రేషిత సేవకు పూనుకోవాలి.

3. వెలుగుకు సంబంధించినవాళ్ళ ప్రధాన లక్షణం సోదర ప్రేమ, తోడి నరులను ప్రేమించేవాడు వెలుగులోను, ప్రేమించనివాడు చీకటిలోను వుంటాడని రూఢిగా చెప్పవచ్చు - 1యోహా 2,9-11. ఈ సూత్రాన్ని ఆధారంగా తీసికొని మనలో వెలుగెంత వుందో, చీకటి యెంత వుందో నిరంతరం వరిశీలించి చూచుకొంటుండాలి.

4. బైబుల్లో చీకటి పాపానికీపిశాచానికీ చిహ్నంగా వుంటుందని చెప్పాం. జ్యోతిర్మయుడైన ప్రభువుని అనుసరించే మనం ఈ పాపాన్నుండి పూర్తిగా వైదొలగాలి. 'రేయి ముగియవచ్చింది. పగలు సమీపించింది. ఇక మనం చీకటికి సంబంధించిన పనులను మానివేద్దాం. పగటివేళ పోరాడ్డానికి ఆయుధాలు ధరిద్దాం" - రోమా 13.12.

నిద్రితుడా! మేలుకో
మృతులలో నుండి లే
క్రీస్తు నీపై ప్రకాశిస్తున్నాడు - ఎఫె 5, 14.

6. జీవాహారం

మానవ జీవితంలో ఆహారం అతిముఖ్యమైంది. అదిలేందే మనకు జీవం లేదు.ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని క్రీస్తు కడపటి విందులో తన శరీరాన్నే మనకు ఆహారంగా దయచేసాడు. దివ్య సత్ర్పసాదం మనకు ఆ ప్రభువు జీవాన్ని ప్రసాదిస్తుంది. కాని మనం ఈ దివ్యసత్ర్పసాదంతోపాటు దైవవాక్యాన్ని గూడ భోజనంగా స్వీకరించాలి. ఈ యంశాలన్నిటినీ విపులంగా పరిశీలిద్దాం.

1. అనుదిన జీవితంలో ఆహారం

అనుదిన జీవితంలో ఆహారం అతి ప్రధానమైంది. బైబులు చాల తావుల్లో ఈ యంశాన్ని ప్రస్తావిస్తుంది.

1. ఆహారం మనలను పోషిస్తుంది

మనం ఆహారం తిని బ్రతుకుతాం. మన ప్రాణాన్ని నిలబెట్టేది అదే సీరా గ్రంథం
"కూడు గుడ్డ నీళ్ళు నరునికి ప్రాథమికావసరాలు
గుట్టగా మనుటకు కొంపగూడ అవసరం"