పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

10. మోక్షపు వెలుగు

బైబుల్లో చివరిదైన దర్శన గ్రంథం మోక్షాన్ని వెల్తురుగా చిత్రిస్తుంది. "ఆ నగరానికి సూర్యచంద్రుల వెల్తురుతో అవసరంలేదు. గొర్రెపిల్లే ఆ నగరానికి దీపం, ప్రపంచవ జనులంతా ఆ దీపపు వెలుగులో నడుస్తారు” ప్రక 21,23-24. మోక్షంలో క్రీస్తే మనకు వెలుగు ఔతాడు - 22, 5. ఆ కాంతివల్ల మనం మిలమిలా మెరిసిపోతాం. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు - మత్త 13,43. వెలుగునకు సంబంధించిన వారు సదా ఈ నమ్మకంతో జీవిస్తారు. మనతోపాటు విశ్వాసంతో జీవించి చనిపోయినవారికి గూడ ప్రభువు ఈ వెలుగును దయచేయాలని మనం నిరంతరం ప్రార్ధిస్తూంటాం.

ప్రార్థనా భావాలు

1. తండ్రి వెలుగు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తుంది. క్రీస్తు వెలుగు అతని శిష్యులమైన మన ముఖంలో ప్రకాశిస్తుంది. ఆ తండ్రి ఆదిలో చీకటినుండి వెలుగు ప్రకాశించుగాక అని పల్మాడు. అలాగే వెలుగు పట్టింది. అతని తేజస్సు ఉత్థాన క్రీస్తుపై ప్రసరించింది. ఈనాడు ఆ ఉత్తానన క్రీస్తు వెల్తురు మన హృదయాల్లో ప్రకాశిస్తుంది. క్రీస్తుపట్ల మనకుండే విశ్వాసమే ఈ వెల్తురు - 2కొ 4,6. మన తరపున మనం ఈ క్రీస్తు వెల్తురుని అధికాధికంగా పొందాలని నిరంతరం ప్రార్థిస్తూండాలి. పూర్వవేద ప్రజలు "ప్రభువు తన ముఖకాంతిని మనపై - ప్రసరింపజేసి మనలను ఆదరంతో జూచునుగాక" అని ప్రార్థించేవాళ్ళు-సంఖ్యా 6,25. "ఓ దేవా! నీ ముఖకాంతిని మామీద ప్రసరింజేయి" అని మనవిచేసే వాళ్లు - కీర్త 4,6. మనం కూడ ఈలాగే ప్రార్థించాలి.

2. ప్రభువు పౌలుని ప్రేషిత సేవకు పిల్చాడు. "నీవు అన్యులకు వెలుగువి కావాలి. ప్రపంచానికంతటికీ రక్షణ మార్గానివి కావాలి. నేను నిన్ను ఈ పనికి నియమించాను" అని చెప్పాడు – అచ 13,47. ఈనాడు అతడు మనకు కూడ ఇదే సేవను అప్పగిస్తాడు. మీ వెలుగుని ప్రజల యెదుట ప్రకాశింపనీయండి అని ఆదేశిస్తాడు - మత్త 5,16. క్రీస్తుపట్ల మనకుండే విశ్వాసమే ఈ వెల్లురు అని చెప్పాం. ఈ వెల్లురుని మనం కుంచం క్రింద పెట్టిన దీపంలాగ దాచివుంచ కూడదు. మన ఆదర్శవంతమైన జీవితం ద్వారానైతేనేమి, మన సత్కార్యాల ద్వారా