పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు మనకు పెద్దన్న- రోమా 8,29. మనం అతనికి తమ్ముళ్ళమూ చెల్లెళ్ళమూను. యన్నద్వారా మనం దేవుని బిడ్డలమౌతాం. ఆయన్నను ముందుంచుకొని దేవుని సన్నిధిలోకి వెత్తాం, దేవునితో తిరిగి రాజీపడతాం. అతడు తన దైవత్వాన్ని వరప్రసాదాన్ని మనకు పంచియిచ్చేవాడు. నరులమైన మనపట్ల సానుభూతి చూపేవాడు. అలాంటి మానుషక్రీస్తుని మనం అనుభవానికి తెచ్చుకోవాలి.

ప్రార్థనా భావాలు1. క్రీస్తు జీవితంలో రెండు ముఖ్య సంఘటనలున్నాయి. ఒకటి క్రిందికి దిగడం,
 మరొకటి పైకెక్కడం, క్రిందికి దిగడమంటే, అతని మనుష్యావతారం. అతడు
 స్వర్గం నుండి భూమిమీదికి దిగిరావడం. పైకెక్కడమంటే, అతని వత్థానం, అతడు
 ఈ లోకంలోనుండి తండ్రివద్దకెక్కిపోవడం. పౌలు ఈ సంఘటనను గూర్చిచెపూ
 "క్రిందికి దిగివచ్చినవాడే ఆకాశమండలానికంటె పైకెక్కిపోయినవాడు. అతడు
 లోకాన్నంతటినీ తన వనికితో నింపుతాడు" అని చెప్పాడు - ఎఫె 4,10. ప్రస్తుతం
 క్రీస్తు క్రిందికి దిగిరావడాన్ని గూర్చి మాత్రమే విచారిద్దాం. పై పౌలే క్రీస్తు
మనుష్యావతారాన్ని గూర్చి చెపూ "అతడు తన్నుతాను రిక్తని చేసికొని, సేవక
రూపం తాల్చి, మానవుల పోలికగా జన్మించాడు" అని వాకొన్నాడు – ఫిలి 2,7.
 ఇక్కడ క్రీస్తు తన్నుతాను "రిక్తని జేసికొన్నాడు" అంటే తన్నుతాను ఖాళీ చేసికొన్నాడని
 భావం. అనగా అతడు దైవత్వాన్ని పూర్తిగా వదలుకొన్నాడో అన్నట్లు దాసుడైన
 నరుడుగా జన్మించాడు. ఇదే మనుష్యావతారం. ఆనాడు క్రీస్తు శిశువులో
 మానవత్వమేగాని దైవత్వ మెవరికీ కన్పింపలేదు. అది ఆ ప్రభువు దైన్యస్థితి.
ఈలా మనకొరకు ఈ మంటిమీదికి దిగివచ్చిన ప్రభువుకీ, మనకోసం తన్నుతాను
 శూన్యం జేసికొన్న ప్రభువుకీ, మనం భక్తిభావంతో ప్రణమిల్లాలి.

2. యోహాను మనుష్యావతారాన్ని గూర్చి చెపూ "ఆ వాక్కు మానవుడై మనమధ్య
 వసించాడు, అతని మహిమను మనం చూచాం" అని వ్రాసాడు - 1,14. ఇక్కడ
 “మనమధ్య వసించడం" "మహిమ" అనే రెండంశాలను పరిశీలిద్దాం.

మొదట "మనమధ్య వసించడం" అనే భావాన్ని తీసికొందాం. యెషయా
 ప్రవక్త "కన్య గర్భవతియై కుమారుని కంటుంది. అతన్ని ఇమ్మానువేలు అని
 పిలుస్తారు" అని చెప్పాడు - 7,14. ఈ వాక్యాన్ని మత్తయి క్రీస్తు శిశువుకి
 అన్వయింపజేసాడు - 1,22-23. “ఇమ్మానువేలు" అంటే మనతోవుండే దేవుడు