పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ప్రభువు గొర్రెలకు ప్రభువు తెలుసు - యోహా 10,15. అవి ప్రభువు స్వరాన్ని వింటాయి - 10,3. ప్రభువు భక్తులూ శిష్యులూ అతని స్వరాన్ని తమ అంతరాత్మలోనే వింటారు, విని అతన్ని అనుసరిస్తారు. అతన్ని అనుభవపూర్వకంగా తెలిసికొంటారు. నిండు హృదయంతో ప్రేమిస్తారు. క్రీస్తుపట్ల వ్యక్తిగతానుభవం లేనివాడు అతని శిష్యుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాడు.
4. కాశ్మీర శైవశాఖకు చెందిన పాశుపత శైవులు శివుణ్ణి పశుపతి గాను తమ్మ వృషభంగాను భావించుకొనేవాళ్లు భాగవత శాఖకు చెందిన వైష్ణవులు కృష్ణుని గోపాలుని గాను తమ్మ గోవుని గాను భావించుకొనేవాళ్లు, ప్రజల భక్తి భావాలు ఆయా సంస్కృతికి తగినట్లుగా బహువిధాలుగా వుంటాయి. బైబులు దేవుణ్ణి కాపరిని గాను భక్తుని గొర్రెగాను చిత్రిస్తుంది. ఇది పండితులకు పామరులకు గూడ అందుబాటులో వుండే సామాన్య భక్తిభావం. మనం ఈ భావాన్ని చక్కగా అర్థం చేసికొని ఆ ప్రభువు పట్ల వ్యక్తిగతమైన అనుభవాన్ని పెంపొందించుకోవాలి.

5. జగజ్యోతి

వెల్లురు ఆహ్లాదాన్నీ ఉత్తేజాన్నీ కలిగిస్తుంది. ఈ భావాన్ని ఆధారంగా తీసికొని బైబులు దేవుణ్ణి, అతని కుమారుడైన క్రీస్తునీ వెలుగునుగా చిత్రిస్తుంది. ఆ క్రీస్తుని పూజించే భక్తులు కూడ వెలుగునకు సంబంధించిన వాళ్ళయి వండాలని చెప్తుంది. ఈ యంశాలను విపులంగా పరిశీలిద్దాం.

పూర్వవేదం

1. దేవుడే వెలుగును చేసాడు

సృష్ణ్యాదిలో దేవుడు వెలుగును చేసాడు. అతడు వెలుగు కలగాలి అనగానే వెలుగు పుట్టింది - ఆది 1,3. వెల్లురికి ప్రత్యర్థియైన చీకటి ఆదిలో అగాధ జలాలమీద వ్యాపించివుంది – 1,2. భగవంతుడు ఈ చీకటిని తొలగించి వెలుగును కలిగించాడు. చీకటి వెలుగులను రెండింటినీ అతడే సృజించాడు - యెష 45,7. కనుక అవి రెండూ అతనికి లొంగివుంటాయి.

2. భగవంతుడు వెల్లురు

బైబులు చాల తావుల్లో భగవంతుడు తేజోమయుడని చెప్తుంది. అతడు వెల్లురిని వస్త్రంలాగ తాల్చాడు - కీర్త 1042. మెరుపులను బాణాల్లాగ విసురుతాడు - 18, 14