పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకేమంద ఒకేకాపరి వండాలని అతని కోరిక–16, అనగా ప్రజలంతా తన్ననుసరించాలనీ, తనద్వారా నిత్యజీవం పొందాలనీ క్రీస్తు అభిమతం. ఆదర్శప్రాయుడైన కాపరి అంటే యూలా వండాలి కదా!

ఈలా పూర్వవేదంనాటి కాపరిని గూర్చిన భావాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవి కొంతవరకు యావే ప్రభువుకీ కొంతవరకు భవిష్యత్తుల్లో రాబోయే మెస్సీయాకూ వర్తిస్తాయి. పూర్వవేదంలోని యావేకు మారుగా నూత్నవేదంలో క్రీస్తు విచ్చేసాడు. యావే పూర్వవేదం లోని ప్రజల పట్ల ఏలా కాపరిలా మెలిగాడో అలాగే క్రీస్తు నూతవేద ప్రజలమైన మనపట్ల కాపరిలా మెలిగాడు. ఆ ప్రభువుని అనుసరిస్తే మనకు క్షేమమూ భద్రతా కలుగుతాయి.

ప్రార్థనా భావాలు

1. క్రీస్తు దయామయుడైన కాపరి. పూర్వం హేబెలు ప్రాణాలు అర్పించాడు - ఆది 4,8, బాధామయుడైన సేవకుణ్ణి గొర్రెపిల్లను లాగ వధ్యస్థానానికి నడిపించుకొనిపోయారు, వధించారు - యెష53,7. మందకు మేలుచేయాలనే కోరికగల మంచికాపరిని బట్టి రొమ్ములు ప్రయ్యలు చేసారు— జెక 12,10. వీళ్ళంతా క్రీస్తుకి సూచనగా వుండే మహానుభావులు, వీళ్ళందరి లక్షణాలు క్రీస్తునందు ఫలసిద్ధినొందుతాయి. కావననే "నేను గొర్రెల కోసం ప్రాణాలు అర్పిస్తాను" అన్నాడు ప్రభువు - యోహా 10,15. తన మరణం ద్వారా మనకు జీవాన్ని చేకూర్చి పెట్టిన త్యాగమూర్తి అతడు. కావున మనం అతనికి ప్రణమిల్లాలి.

2. ఈ సందర్భంలో క్రీస్తు కాపరి లక్షణాలను గూడ పరిశీలిద్దాం. కాపరి గొర్రెలను మంద గూరుస్తాడు. అలాగే క్రీస్తు కాపరి దేవుని ప్రజలను ఒక్కమందగా ఐక్యపరుస్తాడు - యోహా 10, 16 రోజురోజు ఈ గొర్రెలను లెక్కించి చూస్తాడు. ఏవైనా తప్పిపోతే వెంటనే జాగ్రత్తపడతాడు — లూకా 15,3–7, మేతకోసం గొర్రెలను పచ్చిక బయళ్ళకు తోలుకొనిపోతాడు. అక్కడ వన్యమృగాల నుండి వాటిని కాపాడతాడు. వాటికోసం ప్రాణాలు కూడ అర్పిస్తాడు - యోహా 10,11. చెడు గొర్రెలను నుండి మంచి గొర్రెలను వేరుజేస్తాడు. చెడ్డవానికి నరకశిక్షా మంచివానికి మోక్ష సంభావనా దయచేస్తాడు - మత్త 25,31-46, మనం ఈ మంచి గొర్రెల్లా ప్రవర్తించాలి.