పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగరంలోనే జన్మించాడు - మీకా 5,2. ఈ కాపరిని దర్శించడానికి పొలాల్లోని కాపరులు పరుగుపరుగున వచ్చారు – లూకా 2,15-16, ఈ క్రీస్తు యిప్రాయేలీయుల్లో చెదరిపోయిన గొర్రెల కోసం వచ్చాడు - మత్త 15,24. శిష్యులు అతని చిన్నమంద - లూకా 12,32, ఈ కాపరి దయార్ధ హృదయుడు. తప్పిపోయిన గొర్రెను వెదక్కుంటూ వెళ్ళేవాడు — లూకా-15, 4-7. ఈలాంటి దయాపరుడైన కాపరినే యిప్రాయేలీయులకు దయచేయమని పూర్వం మోషే యావేను ప్రార్ధించాడు - సంఖ్యా 27,15. ఈ దయ క్రీస్తులో ఎల్లవేళలా కన్పించేది. కనుక అతడు నాయకుడు లేని తననాటి ప్రజలను చూచి ఎంతో చింతించాడు. "కాపరిలేని గొర్రెలవలె చెదరియున్న జనసమూహాన్ని చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయింది" - మత్త 9,36.

ఆ ప్రభువు జీవితాంతమూ మంచి కాపరిలాగే వ్యవహరించాడు. కడన జకర్యా ప్రవచనం చెప్పినట్లుగానే యూదులు అతన్ని వధించారు. అతని రొమ్ము పొడిచారు, తెరిచారు కూడ - మత్త 26,31. కాని ఈ మందకోసం ప్రాణాలర్పించడం ద్వారానే అతడు “గొప్పకాపరి" కాగలిగాడు - హీబ్రూ 13,20 ; 1షేత్రు 2.25. కాపరియైన ఈ ప్రభువు చెంతకు మనమంతా నమ్మకంతో వెళ్ళాలి. బైబుల్లోని చివరి పుస్తకమైన దర్శన గ్రంథం, ఉత్థాన క్రీస్తుని మోక్షంలోని పునీతుల మధ్య సంచరించే కాపరినిగా చిత్రిస్తుంది. "సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి ఔతుంది. వారిని జీవజలాల వద్దకు నడిపించుకొని పోతుంది" - 7,17. ఈలా క్రీస్తు ఈఆ లోకంలోను మరులోకంలోను గూడ కాపరిలా వ్యవహరిస్తాడు.

7. నాల్గవ సువార్త చిత్రించిన కాపరి

యెహెజ్కేలు ప్రవచనం 34వ అధ్యాయాన్ని ఆధారంగా తీసికొని నాల్గవ సువార్తాకారుడైన యోహాను తన సువిశేషం 10వ అధ్యాయంలో క్రీస్తుని మంచికాపరినిగా చిత్రించాడు. కాపరిని గూర్చిన తొలి మూడు సువార్తల్లోని భావాలకంటె యితని భావాలు కొంచెం విశిష్టంగా వుంటాయి. అంచేత వీటిని ప్రత్యేకంగా విచారించి చూడ్డం అవసరం,

క్రీస్తు గొర్రెలను గాసే “మంచి కాపరి" - 11. పూర్వం యావే పేరుమీదిగా ప్రజలను పాలించిన దుష్టరాజులు "చెడ్డ కాపరులు". వాళ్ళ ప్రజలను పీడించారు. వీళ్ళలా కాకుండా క్రీస్తు ప్రజలకు మేలు చేస్తాడు. గొర్రెలు పచ్చికబయళ్ళకు నడిపించుకొని పోయేవాడూ అతడే-4

అతనికి గొర్రెల పేరు తెలుసు-15. పేరుపెట్టి పిలవగానే గొర్రెలన్నీ అతన్ననుసరిస్తాయి. అతడు గొర్రెల కోసం తన ప్రాణాలనే బలిగా అర్పిస్తాడు — 17.