పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థనా భావాలు

1.ఆనాడు యూదులు పాస్మగొర్రెపిల్ల మాంసాన్నిభుజించి సంతృప్తి చెందారు. దాని నెత్తుటిని గడప కమ్మలకు పూయగా అది ప్రమాదం నుండి వాళ్ళను కాపాడింది. ఈనాడు మన గొర్రెపిల్లయైన క్రీస్తు దివ్యసత్రసాద రూపంలో మనకు అన్న పానీయాలౌతాడు. అతన్ని ఆరగించి మనం ఆధ్యాత్మికంగా పుష్టి చెందుతాం.

2.పూర్వం యూదులు ఐగుపులో గొర్రెపిల్లను బలిగా అర్పించారు. అది వాళ్ళ దాస్యవిముక్తికి కారణమైంది. అటుపిమ్మట వాళ్ళకనాను దేశాన్నిచేరుకొని అక్కడ స్థిరపడిన పిమ్మట ఏటేట ఈ పాస్మబలిని జరుపుకొనేవాళ్ళ ఈ వుత్సవం వాళ్ళకు వరప్రసాద కారణమైంది. నూత్నవేదంలో క్రీస్తు ఒకేవొకసారి కల్వరి కొండమీద బలిఅయ్యాడు. ఈ బలిని మనం రోజురోజు మన పీఠాలపై కొనసాగించు కొంటున్నాం. నిర్దోషమైన ఈ గొర్రెపిల్ల బలి ఈనాడు మనకు పాపపరిహారం చేసిపెడుతుంది. క్రీస్తు అనే గొర్రెపిల్ల నిరంతరం మనకొరకు బలిపశువుగా వండిపోతుంది.

3."గొర్రెపిల్ల వివాహ మహొత్సవానికి ఆహ్వానింపబడినవారు ధన్యలు” - దర్శ 19,9. యూదులు మోక్షాన్ని వివహత్సవం గాను విందుగాను భావించారు. మనమందరం ఓనాడు మోక్షంలో క్రీస్తు గొర్రెపిల్ల సన్నిధిలో వసిస్తాం. అతడు మనకు కాపరీ నాయకుడు ఐ మనలను జీవజలాల వద్దకు నడిపించుకొనిపోతాడు. మన దుఃఖాలన్నీ తొలగించి మనకు నిత్యానందం దయచేస్తాడు - దర్శ 7,17.

4.“మన పాస్క గొర్రెపిల్లమైన క్రీస్తు బలి అయ్యాడు. కనుక దుర్మార్గం దుష్టత్వం అనే పులిసిన పిండితో జేసిన రొట్టెను గాక, నిజాయితి సత్యం అనే పులియని పిండితో చేసిన రొట్టెను వాడుకొని పండుగ జేసికొందాం" - 1కొరి 5,7-8. యూదులు పాస్కపండుగనాడు పులిపిడి ద్రవ్యం కలపని రొట్టెలు తినేవాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రకారం పలిపిడి ద్రవ్యం పాపానికి చిహ్నం. ఇక నేడు క్రీస్తు పాస్మను జరుపుకొనే మనం కూడ పులిపిడి ద్రవ్యాన్ని విసర్జించాలి. అనగా పాపం సోకని పవిత్రమైన జీవితం జీవించాలి. మనకొరకు బిలియైన క్రీస్తుగొర్రెపిల్ల నుండే మనకీ భాగ్యం లభస్తుంది.