పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా నరావతారంద్వారా బాధల కందని దేవుడు బాధలకు లొంగాడు. అతనిద్వారా మనకు విముక్తి కలిగింది. పాపులమైన మనం ఎన్ని శ్రమలనుభవించినా మనపాపాలకు పరిహారం కలిగేదికాదు, కాని క్రీస్తు నరుడై శ్రమలనుభవించడం ద్వారా నరజాతికి దోషవిముక్తి కలిగింది. అతనిపాట్ల మనకు రక్షణాన్నీ దాస్యవిముక్తినీ కలిగించాయి.

6. దత్తపుత్రత్వం

క్రీస్తు మనుష్యావతారం మనకు దైవపత్రత్వాన్ని ఆర్ధించిపెట్టింది. క్రీస్తు పితకు ప్రథమ పుత్రుడు. అతని ద్వారా మనం దేవుని తనయులమౌతాం. ఆ క్రీస్తుక్ సోదరులమౌతాం. క్రీస్తుతో మనం సమరూపులంగావటానికే తండ్రి మనలను ఆ కుమారునియందు ముందుగానే ఎన్నుకొన్నాడు - రోమా 8,29. క్రీస్తు ఓ దేవదూతగా జన్మించి మనలను రక్షించి వుండవచ్చు. కాని అలా చేయలేదు. మన మనుష్య జాతిలో పట్టి, మనుష్యరూపం చేకొని మనలను రక్షించాడు. ఎందుకు? తాను మనకు సోదరుడు, మనకు పెద్దన్న కావడం కోసమే - హెబ్రే 2, 17. మనం ఆ క్రీస్తులోకి జ్ఞానస్నానం పొంది అతనితో ఐక్యమైనప్పడు అతని తండ్రికి తనయులమౌతాం. క్రీస్తు స్వతస్సిద్ధంగానే దైవకుమారుడు, దైవత్వం కలవాడు. మనం స్వతస్సిద్ధంగాకాక క్రీస్తుద్వారా దేవుని కుమారులమై దైవత్వం పొందుతాం. క్రీస్తు దేవునికి సహజపుత్రుడు, మనం దత్తపత్రులం. క్రీస్తు వరప్రసాదం ద్వారా మనం దివ్యలమౌతాం. పూర్వం యిస్రాయేలీయులు నిబంధనంద్వారా దేవుని బిడ్డలూ దేవుని ప్రజలూ అయ్యారు. వాళ్ళకు నిబంధనం సంపాదించి పెట్టిన వరాలను ఈనాడు మనకు జ్ఞానస్నానం సంపాదించి పెడుతుంది.

6. నరుడైన క్రీస్తు

మన భక్తికార్యాల్లో నరుడైన క్రీస్తుకి ఎలాంటి స్థానం వుండాలి? మనం తరచుగా క్రీస్తుని దేవుణ్ణిగా భావిస్తామే గాని నరుడ్డిగా భావించం. ఇది పెద్ద పొరపాటు. అతడు అచ్చంగా మనలాగే నరుడై జన్మించాడు. మనలాగే శోధనలకు గురయ్యాడు, శ్రమలనుభవించాడు - హెబ్రే 4, 15. ఉత్తానుడైన మానుష క్రీస్తే నేడు దేవ ద్రవ్యానుమానాల్లో పనిచేసేది. మోక్షంలో మనం ఆనందించేదికూడ ఈ మానుషక్రీస్తునందే మానవుడూ దేవుడూ ఐన క్రీస్తుద్వారానే నేడు మనం తండ్రిని చేరుకొనేది. కనుక మన ప్రార్థనల్లోను భక్తికార్యాల్లోను క్రీస్తుని కేవలం దేవునిగా మాత్రమే భావించగూడదు. నరుడ్డిగాగూడ భావించుకోవాలి. లేకపోతే అతడు మనుష్యావతారమెత్తి ప్రయోజనమేమిటి?