పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. గొర్రెపిల్ల

క్రీస్తుకి గొర్రెపిల్ల అని పేరు. ఈ పేరు పూర్వ వేదంలోని రెండు సందర్భాల నుండి వచ్చింది. మొదటిది బాధామయ సేవకుడు, రెండవది పాస్క గొర్రెపిల్ల, కనుక ఈ రెండంశాలను పరిశీలిద్దాం.

1. బాధామయ సేవకుడు

యెషయా ప్రవక్త బాధామయ సేవకుణ్ణి వర్ణిస్తూ
"దౌర్జన్యానికి గురైనా అతడు వినయంతో సహించాడు. పలెత్తుమాట అనలేదు.
అతడు వధ్యస్థానానికి గొనిపోబడే గొర్రెపిల్లలాగ,
ఉన్ని కత్తిరింపబడే గొర్రెలాగ
మౌనంగా ఉన్నాడే గాని నోరు తెరవలేదు"

అని చెప్పాడు – 58,7. ఈ వాక్యాల్లో ప్రవక్త సేవకుని వినయాన్నీ అతడు దైవచిత్తానికి లొంగివుండడాన్నీ వర్ణించాడు. నూత్నవేద రచయితలు ఈ సేవకుళ్ళ క్రీస్తుని చూచారు. సేవకునిలాగే క్రీస్తుకి కూడ గొర్రెపల్లి అని పేరు పెట్టారు. ఈ సేవకుడు క్రీస్తునే సూచిస్తాడని ఫిలిప్ప ఇతియోపీయునికి బోధించాడు - అచ 8,32-35. క్రీస్తుకు తీర్పు జరిగేప్పడు ప్రధానార్చకుడు తన్ను ప్రశ్నించినా అతడు జవాబీయకుండా మౌనంగా ఒవండిపోయాడు - మత్త 26,62. అలాగే తన్ను ప్రశ్నించిన పిలాతుకి గూడ జవాబీయకుండా మౌనంగా వుండిపోయాడు - యోహా 19,9, ఈ మౌనం పై యెషయా వాక్యం లోని గొర్రెపిల్ల మౌనాన్ని జ్ఞప్తికి తెస్తుంది. స్నాపక యోహాను క్రీస్తుని తొలిసారిగా శిష్యులకు పరిచయం చేస్తూ "ఇదిగో లోకం పాపాలను పరిహరించే దేవుని గొర్రెపిల్ల" అన్నాడు - యోహా 1,29. ఈ వాక్యంలోని గొర్రెపిల్ల కూడ పై ప్రవచనం లోని గొర్రెపిల్లనే గుర్తుకి తెస్తుంది. కనుక ఈ నూతవేద వాక్యాలన్నీ ఆ బాధామయ సేవకుళ్ళాగే క్రీస్తుకూడ గొర్రెపిల్ల అని చెప్తాయి.

2. పాస్క గొర్రెపిల్ల

యూదులు ఐగుప్త నుండి బయలుదేరక ముందు పాస్కగొర్రెపిల్లను వధించి భుజించారు. దాని నెత్తుటిని తమ యిండ్ల ద్వారబంధాలకు పూసికొన్నారు. కనుక దేవదూత ఆ యిండ్లలోని తొలిచూలు పిల్లలను చంపివేయలేదు - నిర్ణ 12,21-27. యూదులు ఈ పాస్క గొర్రెపిల్ల నెత్తటి ద్వారా తమకు దాస్యవిముక్తి కలిగిందని భావించారు. ఈ సంఘటనను సీనాయి కొండదగ్గర జరిగిన నిబంధనంతో జోడించారు. ఈ రెండు