పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్యవర్తి తానెవరికోపు తీసికొంటాడో వాళ్ళ తరపున ప్రార్థన చేస్తాడు. కనుక ఉత్థాన క్రీస్తు మోక్షంలో మన పక్షాన నిరంతరం ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన ద్వారా మనలను సదా రక్షిస్తుంటాడు — హెబ్రే 7,25,

క్రీస్తు మధ్యవర్తిత్వం ఈనాడు శ్రీసభ ద్వారా మన మీద సోకుతుంది. అతడు శిష్యులద్వారా శ్రీసభను ఏర్పాటు చేయించాడు. "మిూరు వెళ్ళి సకలజాతి జనులను నా శిష్యులనుగా చేయండి. వారికి పిత పత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమీయండి" అని ఆదేశించాడు - మత్త28,18-19, ఈ శిష్యుల ద్వారానే ఈనాడు అతని మధ్యవర్తిత్వం మనమీద పనిచేస్తుంది. అతడు స్థాపించిన జ్ఞానస్నానం దివ్యసత్రసాదం మొదలైన సంస్కారాలు ఈనాడు నరమాత్రుల ద్వారా మనమీద పనిచేస్తాయి.

ప్రార్ధనా భావాలు

1. క్రీస్తు సర్వసంపూరుడైన మధ్యవర్తి పూర్వవేద మధ్యవర్తిత్వమంతా రాబోయే క్రీస్తు వలననే ఫలితాన్ని పొందుతుంది. అతడు స్వయంగా యాజకుడు, ప్రవక్త, రాజు, ఈ మూడు పదవులు ద్వారా అతని మధ్యవర్తిత్వం బహుముఖంగా విస్తరిల్లుతుంది.

2. హెబ్రేయుల జాబు ఈలా చెప్తుంది. క్రీస్తు దయానిధియైన దేవుని సింహాసనం లాంటివాడు. సింహాసనాసీనుడైన రాజు దగ్గరికి వెళ్ళి మన అక్కరలను విన్నవించుకొన్నట్లే ఆ క్రీస్తు దగ్గరికి గూడ వెళ్ళి మన అక్కరలను తెలుపుకోవాలి. ఆ ప్రభువు నుండి కృపను పొందుతాం. మన అక్కరల్లో మనలను ఆదుకొనే వరప్రసాదాన్ని అతని నుండి పొందుతాం - హెబ్రే 4,15-16,

3. ఈనాడు క్రీస్తు నరమాత్రుల ద్వారా తన మధ్యవర్తిత్వాన్ని కొనసాగించుకొని పోతాడని చెప్పాం. ఈ నరమాత్రుల్లో మరియమాత ప్రముఖురాలు. ఆ తల్లి క్రీస్తు ఆర్థించిన వరప్రసాదాన్ని మనకు పంచిపెడుతుంది. ఆమె బ్రతికివుండగా కానావూరి వివాహబృందానికి మేలు చేసింది - యోహా 2,5, క్రీస్తు మరణానంతరం శిష్యులమిదికి ఆత్మదిగిరావాలని ప్రార్థన చేసింది - ఆచ 1,14 క్రీస్తు చనిపోతూ ఆమెను శిష్యులకు తల్లిగా దయచేసాడు - యోహాను 19,26-27. ఆ తల్లి ఈనాడు మోక్షంలో వుండి మన తరపున విజ్ఞాపనం చేస్తుంది. క్రీస్తు మధ్యవర్తిత్వం మన మిద సోకేలా చేస్తుంది. కనుక మనం ఆ తల్లికి ప్రార్థన చేసి ఆమె సహాయాన్ని అడుగుకోవాలి.