పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్లు దేవుని భాగ్యాలను ప్రజల యొద్దకు తీసికొని వస్తారు. ప్రజల ప్రార్థనను దేవునికి అర్పిస్తారు. తోబీతు సారా ప్రార్థన చేసినపుడు రఫాయేలు అనే దేవదూత వారి మనవులను దేవుని సన్నిధిలో అర్పించాడు - తోబీ 12,12.

సంగ్రహంగా చెప్పాలంటే పూర్వవేద మధ్యవర్తులు మూడు పనులు చేసారు. వాళ్లు ప్రవక్తలుగా ప్రభువు సందేశాన్ని ప్రజలకు విన్పించారు. బాధామయ సేవకులుగా ప్రజల తరపున శ్రమలనుభవించారు. యాజకులుగా జనుల తరపున ప్రార్థనలు చేసారు. ఇక ఈ పూర్వవేద మధ్యవర్తులంతా నూత్నవేద మధ్యవర్తియైన క్రీస్తునే సూచిస్తారు.


2. నూత్నవేద మధ్యవర్తి క్రీస్తు

క్రీస్తు నూత్నవేద మధ్యవర్తి "దేవుడు ఒక్కడే దేవునికీ నరునికీ మధ్య మధ్యవర్తి కూడ ఒక్కడే, యేసుక్రీస్తు” - 1తిమొు 2,5, ఈక్రీస్తు ఓ వైపున దేవుడూ మరో వైపున నరుడూ, కనుక అతడు దేవునికీ మానవునికీ మధ్య సంధి గుదర్చడానికి అన్ని విధాల తగినవాడు. ఇతని ద్వారానే తండ్రిని చేరుకోవాలి - హెబ్రే 7:25,

ఈ క్రీస్తు నూత్నమోషే, పూర్వం మోషే యిప్రాయేలీయులకు మధ్యవర్తి అతని ద్వారానే ఆనాడు ప్రభువు యిస్రాయేలీయులతో ఒడంబడిక చేసికొన్నాడు. అతని ద్వారా వాళ్ళకు ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు. ఆ ప్రభువు నూతవేదకాలంలో క్రీస్తుద్వారా కొత్త ఒడంబడిక చేసికొన్నాడు. ఈ క్రీస్తు ద్వారా నూత్న ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు. "దేవుడు మోషే ముఖాన ధర్మశాస్తాన్నిచ్చాడు. కాని యేసు క్రీస్తు మూలాన మనకు కృపాసత్యాలు లభించాయి - యోహా 117. ఇక్కడ "కృప" అంటే తండ్రికి మనమిూద గల ప్రేమ. "సత్యం" అంటే ఆ తండ్రి క్రీస్తు ద్వారా మనలను రక్షిస్తానని వాగ్దానం చేయడం, రక్షించడం. క్రీస్తు మోషేకు మించిన వరప్రసాదాన్ని తీసికొనివచ్చాడు. అతని మధ్యవర్తిత్వం మోషే మధ్యవర్తిత్వం కంటె గొప్పది. మోషే యిప్రాయేలీయులకు నాయకుడై వారిని వాద్దత్త భూమికి కొనిపోతే, క్రీస్తు మనకు నాయకుడై మనలను మోక్షానికి కొనిపోతాడు.

ఈ క్రీస్తు సిలువ మిూద చనిపోతూ నూత్న నిబంధనం ఏర్పాటు చేసాడు. అతని మరణం ధ్వారా నరులకు దోష విముక్తి కలిగింది. ఈ మరణం అతని నిబంధనమూ, వీలునామా కూడ. ఈ వీలునామా ద్వారా మనం దేవుడు వాగ్హానం చేసిన శాశ్వత మోక్షానికి హక్కుదారులమౌతాం. అనగా క్రీస్తు సిలువ మరణం వలన ఏర్పాటైన నూత్న నిబంధనం ద్వారా మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది - హెబ్రే 9,15.