పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిని తన్ను గొలిచే ప్రజలనుగా తయారుచేసాడు, మోషే యెన్నోసారులు యిప్రాయేలు జనం కొరకు ప్రార్థన చేసాడు. ఆ ప్రజలు బంగారు దూడను కొల్చిన పిదప ప్రభువు వాళ్ళను నాశం జేయబోయాడు. కాని మోషేవాళ్ళ తరపున మనవిచేసి వాళ్ళను కాపాడాడు - నిర్ణ32, 11-14.

పూర్వవేదంలో యాజకులుగూడ మధ్యవర్తులుగా పనిజేసారు, వారిద్వారా ప్రజలు దేవుని దీవెన పొందారు - సంఖ్యా 6, 22-27. ఈలాగే రాజులుకూడ మధ్యవర్తులు, వాళ్న దేవునిచే నియుక్తులై ప్రజలను పాలించారు.

ప్రవక్తలు గొప్ప మధ్యవర్తులు, వాళ్ళ దైవచిత్తాన్ని ప్రజలకు తెలియజేసేవాళ్ళు యూదా మక్కబీయుడు ఓ దర్శనంలో యిర్మియా ప్రవక్త ప్రజలకొరకు ప్రార్థన చేయడం చూచాడు - 2 మక్క 15, 13-16,

ఈ రీతిగా ప్రభువు పూర్వవేదంలో నానా వ్యక్తులద్వారా తన ప్రజలకు సేవలు చేయించాడు. ఈ సేవల ద్వారా తాను యిస్రాయేలీయులతో చేసికొనిన నిబంధనాన్ని దృఢపరచాడు.

అంత్యదినాల్లో వచ్చే మధ్యవర్తులు

ప్రవక్తల బోధల్లో అంత్యకాలపు మధ్యవర్తులు కొందరు తగులుతారు. వాళ్ళంతా నూత్నవేదంలో రాబోయే క్రీస్తు మధ్యవర్తినే సూచిస్తారు.

మెస్సీయారాజు ఈలాంటివాడు. అతడు ప్రజలను దేవుని చెంతకు చేర్చాడు. యెషయా పేర్కొన్న బాధామయ సేవకుడు ఈలాంటివాడు. అతడు ప్రజలకు దేవుణ్ణిగూర్చి బోధించాడు. వాళ్ళ తరపున ప్రార్థించాడు. వారి పాపాల పరిహారార్థం తన ప్రాణాలనే అర్పించాడు - యెష53, 10. దానియేలు ప్రవక్త పేర్కొన్న నరపత్రుడు ఈలాంటివాడు. అతడు ప్రభువు ప్రతినిధిగా ప్రజలను పరిపాలిస్తాడు.

"నేను ఆ రాత్రి చూచిన దృశ్యంలో
నరపత్రుని వంటివాడు
మేఘారూఢుడై రావడం గమనించాను
అతన్ని ఆ శాశ్వతజీవి దగ్గరికి కొనిపోయారు
ఆ నరపత్రుడు ఆయననుండి పరిపాలనాన్నీ కీర్తినీ
రాజ్యాధికారాన్నీ పొందాడు
అతని పరిపాలనం శాశ్వతమైంది.
అతని రాజ్యానికి అంతముండదు” - దాని 7,13-44
ఇంకా, ఈ నాయకులతోబాటు దేవదూతలుగూడ మధ్యవర్తులుగా పనిజేస్తారు.