పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతన్ని అణగదొక్కి యూదులకు విముక్తి కలిగించాడు. ఆలాగే క్రీస్తకూడ పిశాచానికి సొమ్ము చెల్లించలేదు. దాన్ని అణగదొక్కి మనకు పాపవిముక్తి కలిగించాడు. ఈలాంటి విమోచకుడైన క్రీస్తుకి మనం సదా కృతజ్ఞలమై యుండాలి.

ప్రార్ధనా భావాలు

1.బైబుల్లో విమోచనం వ్యక్తిపరమైంది మాత్రమే కాదు, సమాజపరమైందికూడ పూర్వవేదంలో ప్రభువు యిస్రాయేలు జాతినంతటినీ యెన్నుకొని ఆ జాతినంతటినీ విమోచించాడు. నూతవేదంలో క్రీస్తు క్రైస్తవ సమాజాన్నంతటినీ, తిరుసభనంతటినీ విమోచిస్తాడు. కనుక మనం తిరుసభ అంతా, మానవజాతి అంతాగూడ రక్షణం పొందాలని ప్రార్థించాలి.

2.మనం ఇక్కడ పాక్షికంగా విమోచనం పొందుతాం. జ్ఞానస్నానంతోనే ఈ పాక్షిక విమోచనం ప్రారంభమౌతుంది. కాని పూర్తి విమోచనం మనం ఉత్థానమై మోక్షాన్ని చేరుకొన్నపుడుగాని లభించదు. ఆ గడియకోసం మనం ఆశాభావంతో ఎదురుచూస్తుండాలి - రోమా 8,23. మనమందరం కూడా ఇప్పటికే కొంతవరకు రక్షణం పొందినవాళ్ళం. ఇంకా పూర్తి రక్షణం పొందవలసినవాళ్ళం. ఈ పూర్తి రక్షణం కొరకు మనం నిరంతరం కృషి చేయాలి.

3.విమోచనం లేక రక్షణమనేది ఎప్పడో పూర్వకాలంలో జరిగిన చారిత్రక సంఘటనంమాత్రమేకాదు. అది యిప్పడుకూడ మనమధ్యలో మన హృదయాల్లో కొనసాగుతూంటుంది. యావే ప్రభువు ఈనాడుకూడ క్రీస్తు ద్వారా మనలను రక్షిస్తుంటాడు. దేవద్రవ్యానుమానాలు, సేవ, సోదరప్రేమ, ప్రార్థన మొదలైన వాటిద్వారా మనం ఈనాడు పొందేది ఈ రక్షణాన్నే విశేషంగా పూజబలిలో ఈనాడు మనం క్రీస్తు రక్షణాన్నిస్వీకరిస్తుంటాం. ఈ బలిని పరస్కరించుకొనే ఆ ప్రభువు "ఇది అనేకుల పాపపరిహారార్థమై చిందింపబడనున్న నూత్ననిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు – మత్త 26,28. కనుక ఈ పూజబలిలో మనం భక్తితో పాల్గొనాలి.

4.విమోచనం తండ్రికీ క్రీస్తకీ మనపట్ల గాఢమైన ప్రేమ వుందని నిరూపిస్తుంది. ఆ తండ్రి మనందరి కొరకు తన సొంత కుమారుని సమర్పించడానికిగూడ వెనుదీయలేదు - రోమా 8,32. ఆ క్రీస్తు మన పాపాలకొరకు ఆత్మార్పణం