పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూస్థాపనం - 19,38-42

శుక్రవారం సాయంత్రం ప్రొద్దు కుంకబోతూంది. విశ్రాంతి దినమైన శనివారం సమిూపించబోతూంది. కనుక క్రీస్తు దేహాన్ని త్వరగా పాతిపెట్టాలి. క్రీస్తు బంధువులు పేదలు, వారికి ఇతరుల సహాయం కావాలి.

కనుక అరిమతయియా యోసేపు నికొదేము క్రీస్తు భూస్థాపనంలో తోడ్పడ్డారు. వీళ్ళిద్దరు క్రీస్తుకి శిష్యులే. కాని యూదులకు భయపడి పరోక్ష శిష్యులుగా మాత్రమే ఉండిపోయారు. క్రీస్తు మరణానంతరం వీళ్ళకు ధైర్యం వచ్చింది. "నేను భూమిమిూది నుండి పైకెత్తబడినపుడు అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకొంటాను" అన్నప్రభువు వాక్యం వారిపట్ల నెరవేరింది – 12,32. పరోక్ష శిష్యులు ప్రత్యక్ష శిష్యులుగా మారిపోయారు. యోసేపు ధైర్యంగా పిలాతుని కలసికొని అతని అనుమతిని పొంది క్రీస్తు దేహాన్ని సిలువ విూదినుండి క్రిందికి దింపి తీసికొని వచ్చాడు. నికొదేము భక్తిభావంతో పరిమళ ద్రవ్యాలు విస్తారంగా తీసికొని వచ్చాడు. సమృద్ధిగా పరిమళ ద్రవ్యాలు వాడ్డం, క్రొత్త సమాధిలో పాతిపెట్టడం అనేవి రాజుల శవాలకు జరిగే మర్యాద. కనుక ఇక్కడ మృత క్రీస్తుని ఓ రాజుని లాగ గౌరవ మర్యాదలతో పాతిపెట్టారు అనుకోవాలి.

సువిశేషాల్లో మూడు సంప్రదాయాలున్నాయి. మార్కు మత్తయిది ఒక పద్ధతి. లూకాది ఇంకొక పద్ధతి. యోహానుది మరొక పద్ధతి. క్రీస్తు శ్రమలను వర్ణించేపుడు ఈ మూడు సంప్రదాయాల వాళ్లు మూడు పద్ధతులను అవలంబించారు.

మార్కు మత్తయి సువిశేషాల పద్ధతి యిది. శిష్యుల బుద్ధి మంచిది కాదు. గెత్సెమని తోపులో ప్రభువు ప్రార్థిస్తుండగా వీళ్ల మూడుసార్లు నిద్రపోయారు. ఒక శిష్యుడు ప్రభువుని అప్పగించాడు. మరొకడు గురువుని ఎరుగనని బొంకాడు. చివరకు అందరు గురువును విడచి పారిపోయారు. క్రీస్తు సిలువ విూద ఆరు గంటల సేపు వ్రేలాడాడు. మూడవ గంట తర్వాత చనిపోయాడు. మరో మూడు గంటల కాలం అతని శవం చిమ్మచీకట్లలో సిలువ మిూద వుండిపోయింది. క్రీస్తు సిలువ మిూద వ్రేలాడుతూ నా దేవా నన్నేల చేయి విడిచావని దీనంగా విలపించాడు. క్రీస్తు మరణించిన పిమ్మటనే కాని తండ్రి జోక్యం జేసికొని కుమారుని నిజాయితీని వెల్లడి చేయలేదు. శత్రువులు క్రీస్తు విూద తెచ్చిన నేరాలు అతడు దేవుని కుమారుద్ధాని చెప్పకొని దేవదూషణ పలకడం, దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ మూడు రోజుల్లో నిర్మిస్తానని చెప్పడం. క్రీస్తు చనిపోయేపుడు