పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2. సిలువ మరణం - 19,17-37

యోహాను వర్ణించిన క్రీస్తు శ్రమల ఘట్టంలో ఐదు ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ యంశాలు చాల వరకు యోహాను సువిశేషంలో మాత్రమే కన్పిస్తాయి. కనుక వీటిని శ్రద్ధతో పరిశీలిద్దాం.

1. పిలాతు వ్రాయించిన శాసనం - 19, 17-22

యూద నాయకుల వత్తిడికి లొంగి పిలాతు క్రీస్తుకి మరణశిక్ష విధించాడు. సిలువ వేసే ద్రోహిని నలురు రోమను సైనికుల మధ్య వుంచి వధ్యస్థానానికి నడిపించుకొనిపోతారు. కనుక సైనికులు ప్రభువుని కూడ అలాగే తీసికొనిపోయి ఉండాలి.

క్రీస్తుని నగరం వెలుపల కొండపై సిలువ వేసారు. ఆ కొండకు గొల్గొతా లేక కపాలం అని పేరు. ఆ పేరు దానికెలా వచ్చింది? ఆ కొండ నరుని పుర్రె ఆకారంలో వుండవచ్చు లేదా అక్కడ సిలువ వేసినవాళ్ళ పుర్రెలు చిందరవందరగా పడి ఉండవచ్చు కనుక దాన్ని కపాలస్థలం అన్నారు.

క్రీస్తు తన సిలువను తానే మోసికొని పోయాడు-19,17. అనగా అతడు తన సిలువ మరణాన్ని తానే ఎన్నుకొన్నాడు. అతడు దిక్కులేనివాడై శత్రువులకు చిక్కినిర్బంధంగా సిలువ మరణం అనుభవించలేదు. "ఎవడు నా ప్రాణాలను తీయలేడు. నాయంతట నేనే నా ప్రాణాన్ని ధారపోస్తాను. మళ్లీ దాన్ని తీసికొంటాను" అని పలికాడు ప్రభువు, 10,18. కనుక అతడు సర్వతంత్ర స్వతంత్రుడు.

పూర్వం ఈసాకు దహనబలికి కావలసిన కట్టెల మోపును మోస్తూ కొండ యెక్కాడు, ఇక్కడ క్రీస్తు ఆ యిూసాకుని తలపునకు తెస్తాడు. క్రీస్తుకి ఇరువైపుల ఇద్దరు దొంగలను కూడ సిలువ వేసారు. యోహాను దృష్టిలో క్రీస్తు రాజు. అతడు సిలువ సింహాసనమెక్కాడు. ఈ దొంగలు ఇద్దరు అతని పరివారం లాగ ఈ వైపున ఒకడు ఆ వైపున ఒకడు నిల్చివున్నారు.

మామూలుగా దోషి చేసిన అపరాధాన్ని ఒక రేకుపై వ్రాస్తారు. దాన్ని ఒక సైనికుడు చేతితో పట్టుకొని ఎల్లరికీ చూపిస్తూ ద్రోహికి ముందుగా నడుస్తాడు. తర్వాత దాన్నిసిలువ విూద అంటగొడతారు. ఇక్కడ క్రీస్తు విషయంలో పిలాతే స్వయంగా శాసనాన్ని వ్రాయించాడు, "నజరేయుడైన యేసు యూదుల రాజు" అని వ్రాయించాడు. కాని ఈ వాక్యం యూద నాయకులకు నచ్చలేదు. వాళ్లు కైజరే మాకు రాజు అని అంతకుముందే నినాదాలు చేసారు - 19,15. ఇప్పడు క్రీస్తుని తమ రాజునిగా ఒప్పకోవడం అవమానకరమని యెంచారు. కనుక పిలాతు ఈ శాసన వాక్యాన్ని మార్చాలని వత్తిడి