పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డనటానికీ, చిహ్నాలు. ఈ యైదింటిలో మొదటిదాన్ని మత్తయి మార్కు యింకా లూకా పేర్కొన్నారు. మిగతా నాల్డింటిని మత్తయి మాత్రమే పేర్కొన్నాడు. ఇక ఈ యైదు సంఘటనల భావాన్ని క్రమంగా పరిశీలిద్దాం.

1. దేవాలయం తెర చినగడం, దేవాలయంలో చాల తెరలుండేవి. ఇక్కడ చినిగిన తెర దేవళంలోని గర్భాగారానికి ముందుండేది. ఈ తెరవెనుక గర్భగృహంలో మందసం వుండేది, దానిలో ప్రభువు మోషేకి వ్రాసి యిచ్చిన రాతిపలకలుండేవి. ఈ స్థలంలో "షెకీనా" అనే పేరుతో దైవసాన్నిధ్యం నెలకొనివుండేది. ఈతావలోకి ప్రధానార్చకుడు మాత్రమే వెళ్ళేవాడు. అది కూడ ఏడాదికి ఒక్కసారి మాత్రమే, ప్రాయశ్చిత్త దినాన. కనుక ఇది సామాన్య జనులు పోగూడనితావు. దేవాలయంలోకెల్లా మహా పవిత్ర స్థలం.

ఇక్కడ ఈ తెర చినిగిపోవడంలో భావం ఏమిటి? పూర్వవేదంలోని ప్రజలు సులువుగా దేవుని దగ్గరికి వెళ్ళలేక పోయేవాళ్లు, దేవుడంటే వాళ్ళకు గౌరవమేకాని, మాలావ భయం కూడ. పైతెర దేవునికీ ప్రజలకీ మధ్య అడ్డుగోడగా నిల్చేది. క్రీస్తు మరణంతో ఈ యడుగోడ తొలగిపోయింది. ఇక ప్రజలు సులువుగా దేవుని చెంతకు రావచ్చు. క్రీస్తు ద్వారా, అతడు సంపాదించి పెట్టిన రక్షణం ద్వారా, ఎల్లరూ సులభంగా తండ్రిని చేరవచ్చు.

ఇంకా, యూతెర చినిగిపోవడం పూర్వవేద దేవాలయ విధ్వంసాన్ని గూడ సూచిస్తుంది. మత్తయి సువిశేషం ప్రచారంలోకి వచ్చిన కాలంలో, అనగా క్రీ.శ.70లో రోమిూయులు దండెత్తి వచ్చి యెరూషలేం పట్టణాన్నీ దేవళాన్నీ నాశం చేసారు. ఇక్కడ ఈ చినిగిన తెర నాశనమైన దేవళానికి గుర్తు, ఈ దేవాలయాన్ని రాతిమిూద రాయి నిలువనీయకుండా పడగొడతారని క్రీస్తు ముందే చెప్పాడు – 242. యూదులు అవిశ్వాసులై క్రీస్తుని నిరాకరించారు. కనుక వాళ్ళూ వాళ్ళ ఆరాధన స్థలమూ, ఆరాధనకాండా అంతా నాశమైపోతాయి. వాటిస్థానే నూతారాధనం వస్తుంది. అది క్రైస్తవారాధనం. ఉత్థాన క్రీస్తూ అతన్ని విశ్వసించే క్రైస్తవ ప్రజా కలసి నూత్న దేవాలయమౌతారు. ఇక ప్రాతయుగ దేవాలయం గతించి ఈ నూత్నయుగ దేవాలయం ఏర్పడుతుంది.

2-3. భూకంపమూ, కొండబండలు పగలడమూ, క్రీస్తు చనిపోయినప్పడే ఉత్తానం కూడ చేసాడు. అతని ఉత్తాన ప్రభావానికి భూమి కంపించింది. దానివల్ల కొండబండలు కూడ పగిలాయి. అంత్యకాలంలో ఈలాంటి ఉత్పాతాలు కలుగుతాయని ప్రవక్తలు ముందుగానే తెలియజేసారు. కీర్తన 68,8 ప్రభువు రాకడను జూచి భూమి కంపించింది, ఆకాశం వర్షించింది అని చెప్తుంది, ఈ యంత్యకాలాన్ని గూర్చి చెపూ يكفي కూడ 'ఆ కాలంలో అనేక ప్రదేశాల్లో కరవులూ భూకంపాలు కలుగుతాయి" అన్నాడు -